ETV Bharat / international

భారత్​తో 14 ఏళ్ల కలను బైడెన్​ నెరవేర్చుకుంటారా?

భారత్‌, అమెరికాలు ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలుగా ఎదగాలని ఎప్పటినుంచో ఆకాంక్షిస్తున్నారు జో బైడెన్​. 2020 నాటికి ఈ రెండు దేశాలను ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలుగా చూడాలన్నదే తన కల అని.. అది నెరవేరితే యావత్ ప్రపంచం సురక్షితంగా ఉంటుందని 2006 డిసెంబర్‌లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న బైడెన్​ తన 14 ఏళ్ల కలను నెరవేర్చుకుంటారా?

Biden administration will place high priority on strengthening Indo-US relationship: policy paper
'భారత్​తో బంధం' కలను బైడెన్​ సాకారం చేసుకుంటారా
author img

By

Published : Nov 8, 2020, 12:18 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసి అగ్రరాజ్యాధినేతగా ఎదిగిన జో బైడెన్.. భారత్‌, అమెరికాలు ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలుగా ఎదగాలని ఎప్పటినుంచో ఆకాంక్షిస్తున్నారు. ఆ దిశగా కృషిచేస్తామంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా విడుదల చేసిన విధాన పత్రంలోనూ జో బైడెన్ పేర్కొన్నారు. 2020 నాటికల్లా భారత్‌, అమెరికాలను ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలుగా చూడాలన్నదే తన కలన్న బైడెన్.. అదే నెరవేరితే యావత్ ప్రపంచం సురక్షితంగా ఉంటుందని 2006 డిసెంబర్‌లో ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించి అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో తన 14 ఏళ్ల కలను సాకారం చేసే అవకాశం బైడెన్‌కు లభించింది.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌ను శాశ్వత సభ్యదేశంగా మార్చడం సహా ఉగ్రవాదం, వాతావరణ మార్పు, ఆరోగ్యం, వాణిజ్యంపై సహకారాన్ని కొనసాగించడం ద్వారా భారత్- అమెరికాల సంబంధాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎన్నికల సమయంలో విడుదల చేసిన పాలసీ పేపర్‌లో బైడెన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం అంశాన్ని తొలుత విధానపత్రంలో ప్రస్తావించిన బైడెన్.. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడం వంటి అంశాలకు చోటిచ్చారు.

ఒబామా హయాంలో కీలక పాత్ర

వ్యూహాత్మక సంబంధాలతోపాటు ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించి సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా, బరాక్ ఒబామా పరిపాలనలో ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్ ప్రధాన పాత్ర పోషించారు. 2008లో భారత్-అమెరికాల మధ్య పౌర అణు ఒప్పందానికి ఆమోదం లభించేలా అమెరికన్ కాంగ్రెస్‌లో నాయకత్వం వహించడం సహా డెమొక్రాట్లు, రిపబ్లికన్లతో కలిసి ఒప్పందం ఆమోదం పొందేలా కృషిచేశారు.

కలిసి నడవాలి...

భారత్, అమెరికాలను సహజ భాగస్వాములుగా పాలసీ పేపర్‌లో అభివర్ణించిన బైడెన్... బాధ్యతాయుతమైన భాగస్వామ్య దేశాలుగా భారత్-అమెరికా కలిసి నడవనిదే ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే ఏ సవాల్‌ను పరిష్కరించలేమని అభిప్రాయపడ్డారు. తీవ్రవాద వ్యతిరేక భాగస్వామ్యదేశంగా భారత్‌ రక్షణ రంగ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం సహా.. ఆరోగ్య రంగం మెరుగుదల, ఉన్నత విద్య, అంతరిక్ష పరిశోధన, వంటి రంగాలలో సంబంధాలు బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద, పురాతనమైన ప్రజాస్వామ్య దేశాలుగా ప్రజాస్వామ్య విలువలకు, న్యాయమైన స్వేచ్ఛాయుత ఎన్నికలు, సమానత్వం, భావప్రకటనా స్వేచ్ఛ, మతం వంటి అంశాలకు భారత్, అమెరికా కట్టుబడి ఉన్నట్లు విధాన పత్రంలో పేర్కొన్నారు. ఈ ముఖ్య సూత్రాలకు ఇరుదేశాలు ఎప్పటి నుంచో కట్టుబడి ఉన్నట్లు తెలిపిన బైడెన్...ఈ సూత్రాలే భవిష్యత్తులో మన బలానికి మూలంగా నిలుస్తాయని విధానపత్రంలో పేర్కొన్నారు.

వాటికి ప్రాధాన్యం..

ఒబామా హయాంలో వ్యూహాత్మక, రక్షణ, ఆర్థిక, ప్రాంతీయ, ప్రపంచ సవాళ్ళపై భారత్ అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా కృషి జరిగిందన్న బైడెన్.. తమ పాలనలోనూ దీనికి కట్టుబడి ఉంటానని విధాన పత్రంలో తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఒబామా హయాంలో అమెరికా అధికారికంగా మద్దతు తెలిపిందన్న బైడెన్... నాటి హయాంలోనే భారత్‌ను ప్రధాన రక్షణరంగ భాగస్వామిగా గుర్తించినట్లు తెలిపారు. ఒబామా పరిపాలనలో ఉగ్రవాదంపై పోరుకు భారత్‌-అమెరికాల మధ్య సహకారాన్ని బలపరిచామన్న బైడెన్..... దక్షిణ ఆసియాలో ఉగ్రవాదాన్ని సహించలేమని విధానపత్రంలో అభిప్రాయపడ్డారు. చైనాతో సహా ఏ దేశమూ తన పొరుగుదేశాలపై బెదిరింపులకు పాల్పడకుండా ఇండో పసిఫిక్ స్థిరత్వం కోసం నిబంధనల ఆధారంగా మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు.

వాతావరణ మార్పులకు సంబంధించిన అంశంలోనూ భారత్‌తో కలిసి నడుస్తామని బైడెన్ విధానపత్రంలో పేర్కొన్నారు. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా పారిస్ వాతావరణ ఒప్పందంపై సంతకం చేయడానికి ఒబామా హయాంలో భారత్‌తో కలిసి పనిచేసినట్లు తెలిపారు. అమెరికాను తిరిగి పారిస్ ఒప్పందంలోకి తెస్తామన్న బైడెన్.. వాతావరణ మార్పులపై భారత్‌తో కలిసి పోరాడతామన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు భారత్‌తో కలిసి నడుస్తామని విధానపత్రంలో స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.