ETV Bharat / international

బైడెన్​ నిర్ణయంతో భారతీయ ఐటీ నిపుణులకు ఊరట! - US GOVT

ట్రంప్​ హయాం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీసాదారులకు బైడెన్​ సర్కార్​ ఊరట కల్పించింది. వారి సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో భారతీయ ఐటీ నిపుణులకు ఉపశమనం లభించనుంది.

Biden admin to reconsider objections to H1B visas
బైడెన్​ నిర్ణయంతో భారతీయ ఐటీ నిపుణులకు ఊరట!
author img

By

Published : Mar 13, 2021, 9:09 AM IST

హెచ్​1బీ వీసాలకు సంబంధించి ట్రంప్ సర్కారు ఇచ్చిన 3 ఆదేశాలతో తలెత్తే సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని బైడెన్ సర్కార్ స్పష్టం చేసింది. ఈ అమెరికా అధ్యక్షుడి నిర్ణయంతో.. ట్రంప్ హయాం నుంచి ఇబ్బందులు పడుతున్న భారతీయ ఐటీ నిపుణులకు ఊరట లభించింది. ఈ మేరకు.. ఫామ్‌-ఐ-129కి సంబంధించి ట్రంప్ హయాంలో తెచ్చిన విధానాలతో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరిస్తామని యూఎస్​ సిటిజెన్​షిప్ అండ్​ ఇమిగ్రేషన్​ సర్వీసెస్​(యూఎస్​సీఐఎస్​)​ ప్రకటించింది.

ఆ మూడు విధానాలతో ఇబ్బందులు పడుతున్న వారు వాటిపై యూఎస్​సీఐఎస్​కు తగిన రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని తెలిపింది. వాటిపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం కూడా తమకు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఫ్లాయిడ్​ కుటుంబీకులకు రూ.196 కోట్ల నష్టపరిహారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.