అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా... సినీ నిర్మాతలుగా ఇకపై బిజీగా గడపనున్నారు.
సినిమాలపై ఆసక్తితో స్థాపించిన 'హయ్యర్ గ్రాండ్ ప్రొడక్షన్' త్వరలో నిర్మించబోయే సినిమాల వివరాలు వెల్లడించారు. 7 సినిమాలు, సిరీస్‌లు తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.
ఇవి వినోదాన్ని మాత్రమే కాక విజ్ఞానాన్నీ అందించేలా, అందరినీ ప్రభావితం చేసేలా ఉంటాయని చెప్పారు ఒబామా దంపతులు.
సినిమాలు, సిరీస్‌ల ప్రదర్శన కోసం ఆన్లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో గతేడాది ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
కథాంశాలు ఇవే...
అమెరికా సామాజిక సంస్కర్త ఫ్రెడ్రిక్ డగ్లస్ జీవిత చరిత్రకు డేవిడ్ బ్లైట్స్ అక్షర రూపం ఇచ్చారు. ఆ రచన ప్రఖ్యాత పులిట్జర్ పురస్కారం గెలుచుకుంది. ఇప్పుడు ఆ పుస్తకం ఆధారంగా సినిమా తీయనున్నారు ఒబామా దంపతులు.
ప్రపంచానికి పెద్ద తెలియని ప్రముఖులను పరిచయం చేసేందుకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక "ఒవర్లుక్డ్ " పేరిట ఓ కాలమ్ ప్రచురిస్తోంది. దీని ఆధారంగా మరో సీరిస్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు ఒబామా.
మరికొన్ని సామాజిక అంశాలతో సినిమాలు, షోలు తీయనున్నట్లు తెలిపారు.