అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో మరోసారి కార్చిచ్చు రగిలింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. బలమైనగాలులు తోడై పామ్ స్ప్రింగ్స్ పట్టణానికి మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి.
చాలా చెట్లు దగ్ధమయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పట్టణమంతా దాదాపుగా అంధకారంలో ఉండిపోయింది.
బలమైన గాలులు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.