ETV Bharat / international

ఆస్ట్రేలియాలో 3 నెలల్లో కనిష్ఠ కేసులు నమోదు - world corona cases

ప్రపంచ దేశాలపై కరోనా ప్రతాపం కొనసాగుతోంది. మొత్తం కేసులు 3 కోట్ల 10 లక్షలు దాటాయి. మరణాల సంఖ్య 9 లక్షల 62 వేలను అధిగమించింది. అయితే రికవరీలు 2 కోట్ల 26 లక్షలు దాటడం ఊరట కలిగించే అంశం. ఆస్ట్రేలియాలో 3 నెలల్లో ఇవాళే కనిష్ఠ కేసులు నమోదయ్యాయి.

Australia reports fewest COVID-19 cases in 3 months
ఆస్ట్రేలియాలో 3 నెలల్లో కనిష్ఠ కేసులు నమోదు
author img

By

Published : Sep 20, 2020, 8:20 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పలు దేశాల్లో వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది.

రష్యాలో రోజూ 6 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 6 వేల 148 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 79 మంది మరణించారు. మొత్తం కేసులు 10 లక్షల 3 వేలు దాటాయి. మరణాల సంఖ్య 20 వేలకు చేరువైంది.

  • మెక్సికోలో 5 వేల 167 కొత్త కేసులు.. 455 మరణాలు వెలుగుచూశాయి.
  • అర్జెంటీనా, ఇరాన్​, ఇండోనేసియాలో రోజూ 3 వేలకుపైగా కేసులు, 100కు పైగా మరణాలు నమోదవుతున్నాయి.
  • సింగపూర్​లో మరో 18 మందికి కరోనా సోకింది. దేశంలో ఇప్పటివరకు 27 మంది మరణించారు.
  • నేపాల్​లో ఒక్కరోజే 1,325 కొత్త కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసుల సంఖ్య 64 వేలు దాటింది. మరో 10 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 411కు చేరింది.
  • ఆస్ట్రేలియాలో ఆదివారం 19 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 3 నెలల్లో ఇదే అత్యల్పం కావడం విశేషం. దేశంలో ఎక్కువ కేసులు విక్టోరియాలోనే ఉంటున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.