ETV Bharat / international

'గిన్నిస్​ డే' స్పెషల్.. వీరి సరికొత్త రికార్డులు సూపర్ గురూ! - గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు

అతిపెద్ద పిజ్జా, పొడవైన మీసం, భారీ గుమ్మడికాయ, పెద్ద ఆలుగడ్డ... అంతేనా.. స్కేటింగ్, డ్రాయింగ్, మ్యూజిక్, డాన్సింగ్... ఇలా ఏ విషయంలో రికార్డులు సాధించినా ముందుగా మనకు వినిపించే పదం గిన్నిస్. అలాంటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే (Guinness World Records day) సందర్భంగా.. పలువురు ఔత్సాహికులు, అథ్లెట్లు సరికొత్త ఫీట్లు చేశారు.

GUINNESS RECORDS DAY
GUINNESS RECORDS DAY
author img

By

Published : Nov 17, 2021, 5:52 PM IST

'గిన్నిస్​ డే' స్పెషల్.. అథ్లెట్ల సరికొత్త రికార్డులు

కళ ఏదైనా.. ఆట ఏదైనా.. ఉత్సవమైనా.. కార్యక్రమమైనా... విభిన్నంగా, భారీ స్థాయిలో ఏది నిర్వహించినా.. దానికి గిన్నిస్ రికార్డు దాసోహం కావాల్సిందే! కాదేదీ గిన్నిస్ రికార్డుకు (Guinness World Records) అనర్హం అన్నట్టు.. కొత్త రికార్డులు ఏది నమోదైనా మనకు గిన్నిస్ పేరు వినిపిస్తుంటుంది.

GUINNESS RECORDS DAY
కార్​ను లాగుతున్న చైనా వాసి

అలాంటి గిన్నిస్ రికార్డులను (Guinness World Records Day 2021) సెలబ్రేట్ చేసుకునేందుకు ఒక రోజంటూ ఉంటుందని తెలుసా? అవును.. నవంబర్ 18న వరల్డ్ గిన్నిస్ రికార్డ్స్​ డే (Guinness World Records Day 2021) నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలువురు అథ్లెట్లు సరికొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (Guinness World Records 2021) తాజా సంచికలో ఈ రికార్డులన్నీ పొందుపర్చనున్నారు.

GUINNESS RECORDS DAY
సైకిల్​ను 360 డిగ్రీల్లో తిప్పుతూ స్టంట్

6 మీటర్ల దూరం బ్యాక్ ఫ్లిప్​...

బ్రిటన్​కు చెందిన జిమ్నాస్ట్ (Gymnastics Guinness World Records) ఆష్లే వాట్సన్.. సమానంగా ఉంచిన రెండు పోల్స్ నుంచి ఆరు మీటర్ల దూరంలో ఉన్న మరో పోల్స్​ వరకు బ్యాక్ ఫ్లిప్ చేసి.. కొత్త రికార్డు నెలకొల్పారు. ఇందుకోసం కఠినంగా శిక్షణ పొందారు. పట్టుదలతో ప్రయత్నిస్తే గిన్నిస్ సాధించడం కష్టమేమీ కాదని ఇతరులకు చెబుతున్నారు.

ఫుట్​బాల్​తో

అమెరికాకు చెందిన లారా బియోండో ఫుట్​బాల్​ను (Guinness Football records) ఒంటికాలితో నియంత్రిస్తూ రెండు రికార్డులను దక్కించుకున్నారు. నిమిషంలో అత్యధిక సార్లు కాలిని బంతి చుట్టూ తిప్పి ఓ రికార్డు సాధించిన బియోండో.. కూర్చొని ఎక్కువసార్లు ఫుట్​బాల్​ క్రాసోవర్​లు చేసిన మహిళగానూ రికార్డుకెక్కారు.

GUINNESS RECORDS DAY
ఫుట్​బాల్ క్రాసోవర్ చేస్తున్న బియోండో

మరిన్ని...

యూకేకు చెందిన టైలర్ ఫిలిప్స్ పోగో స్టిక్​తో ఎక్కువ సంఖ్యలో కార్లపై నుంచి జంప్ చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు.

చైనాకు చెందిన ఝాంగ్ షువాంగ్.. చేతులపై నడుస్తూ కారును వేగంగా 50 మీటర్ల దూరం లాగి ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నారు.

సైకిల్​ను 360 డిగ్రీల్లో తిప్పే 'బీఎంఎక్స్ టైమ్ మెషీన్' ట్రిక్​ను 30 సెకన్లలో 45 సార్లు చేసి జపాన్​కు చెందిన టకాహిరో ఐకెడా రికార్డు సాధించారు.

ఖతర్​కు చెందిన ఆయుబ్ తౌబే.. 30 సెకన్లలో 12 సార్లు ఒంటికాలితో సోమర్​సాల్ట్స్​ చేసి గిన్నిస్ బుక్​లో చోటు దక్కించుకున్నారు.

GUINNESS RECORDS DAY
సోమర్​సాల్ట్స్​ చేస్తూ...

గిన్నిస్ రికార్డు కథనాలు:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.