బ్రెజిల్ రియో డీ జనీరోను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలో పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు నీట మునిగాయి. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా ఒకరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
వరదల కారణంగా పేరుకుపోయిన మట్టిని, వ్యర్థాలను తొలగించేందుకు భారీ యంత్రాలను అధికారులు వినియోగిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో సహయక చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.
జనవరిలో 80 మంది మృతి
ఈ ఏడాదిలో జనవరిలో ఆగ్నేయ బ్రెజిల్‌ను సైతం వానలు ముంచెత్తాయి. ఆ వరదల కారణంగా 80 మందికి పైగా మృత్యువాతపడినట్లు అధికారులు ప్రకటించారు.
ఇదీ చూడండి:తీరుమారని కిమ్.. మరోసారి ఆయుధ పరీక్షలు!