మెక్సికోలో మాదకద్రవ్యాల ముఠా దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ మారుమూల దారిలో వెళ్తున్న మూడు ఎస్యూవీ వాహనాలపై ఆకస్మికంగా దాడి చేసిన దుండగులు ఓ వాహనాన్ని పూర్తిగా తగలబెట్టారు. తుపాకి గుండు తగిలే వాహనంలో పేలుడు సంభవించిదని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో ఆరు నెలల కవలలు సహా మొత్తం ఆరుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతిచెందిన వారందరూ అమెరికా పౌరులేనని అధికారులు వెల్లడించారు.
ప్రత్యర్థులు తమపై దాడిచేస్తున్నారని భావించే.. వాహనాలపై దుండగులు దాడి చేసి ఉంటారని మెక్సికో భద్రతా కార్యదర్శి అల్ఫొంసో డురాజో అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారని చెప్పిన ఆయన... వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఆచూకీ కోల్పోయిన ఓ చిన్నారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
సాయానికి సిద్ధం.. అమెరికా
ఘటనపై విచారం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... మాదకద్రవ్య ముఠాపై ప్రతీకారం తీర్చుకోవడానికి మెక్సికోకు సహకరిస్తామని ప్రకటించారు. ఈ ముఠాలను అంతమొందించడానికి మెక్సికో తమ సహకారం కోరితే అమెరికా తప్పకుండా ముందుంటుందని ట్వీట్ చేశారు ట్రంప్. వీరిని అంతమొందించడానికి యుద్ధం చేయాల్సి వస్తుందని అన్నారు.
-
This is the time for Mexico, with the help of the United States, to wage WAR on the drug cartels and wipe them off the face of the earth. We merely await a call from your great new president!
— Donald J. Trump (@realDonaldTrump) November 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is the time for Mexico, with the help of the United States, to wage WAR on the drug cartels and wipe them off the face of the earth. We merely await a call from your great new president!
— Donald J. Trump (@realDonaldTrump) November 5, 2019This is the time for Mexico, with the help of the United States, to wage WAR on the drug cartels and wipe them off the face of the earth. We merely await a call from your great new president!
— Donald J. Trump (@realDonaldTrump) November 5, 2019
మెక్సికో తిరస్కరణ
అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదనను మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపేజ్ తిరస్కరించారు. ట్రంప్ ఆలోచనను గౌరవిస్తున్నామని అయితే తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.