కెనడా నోవా స్కోటియా రాష్ట్రంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 18 మందిని చంపిన దుండగుడు ఓ దంతవైద్యుడు గాబ్రియేల్ వోర్ట్మెన్గా దర్యాప్తులో తేలింది.
హాలీఫ్యాక్స్ సమీపంలోని పోర్తపిక్యూ గ్రామంలో గాబ్రియేల్ జరిపిన కాల్పుల్లో ఓ మహిళా కానిస్టేబుల్ సహా 17 మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు భయంతో వణికిపోయారు. అప్రమత్తమైన పోలీసులు 51 ఏళ్ల గాబ్రియేల్ కాల్చి చంపారు.
నిందితుడు కాల్పుల వెనుక ఉద్దేశమేమిటో ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. అయితే, గార్బియేల్ పోలీస్ దుస్తులు ధరించి, కారును పోలీసు వాహనంలా మార్చి దారుణానికి ఒడిగట్టాడు కాబట్టి పూర్తి పన్నాగం ప్రకారమే ఈ దాడికి పాల్పడ్డాడి ఉంటాడని అభిప్రాయపడ్డారు ఓ ఉన్నతాధికారి.
ఇంత దారుణం తొలిసారి..
గత 30 ఏళ్ల కెనడా చరిత్రలో ఇంతటి దారుణ ఘటన జరగడం ఇదే తొలిసారని అధికారులు చెప్పారు. 1989లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. అప్పటి నుంచి దేశంలో తుపాకుల వాడకంపై కఠిన ఆంక్షలు విధించారు.
ఇదీ చదవండి:12 రోజుల పసిపాపకు, ల్యాబ్ డాక్టర్‌కు కరోనా!