గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరగటం వల్ల ఒక్కసారిగా ఆస్పత్రి వార్డుల్లో దట్టమైన పొగ అలుములుకుంది. భయభ్రాంతులకు గురైన రోగులు, సిబ్బంది పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్ని మాపక దళం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసింది. సుమారు 90 మంది క్షతగాత్రులను మరో ఆస్పత్రికి తరలించారు అధికారులు. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆస్పత్రి సిబ్బంది, రోగుల బంధువులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
హాస్పిటల్‌లోని జెనరేటర్లో షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: 'ఐరాస'లో కశ్మీరీల గళం వినిపిస్తా: పాక్ ప్రధాని