ETV Bharat / international

అమెరికాలో 'ఫేక్​ బ్యాలెట్​' ట్రక్ కలకలం - ఫిలడెల్ఫియా ఫేక్​ బ్యాలెట్లు

అమెరికాలో 'ఫేక్​ బ్యాలెట్'​ వార్త కలకలం రేపింది. ఫిలడెల్ఫియాలో.. భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు.. 'ఫేక్​ బ్యాలెట్ల'​ ట్రక్​ను ఓ ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలిస్తుండగా పోలీసులు అరెస్ట్​ చేశారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలపై అధ్యక్షుడు ట్రంప్​ ఆరోపణలు చేస్తున్న తరుణంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Armed men arrested ouside counting centre in Philadelphia were trying to deliver fake ballots: Reports
అమెరికాలో 'ఫేక్​ బ్యాలెట్​' ట్రక్ కలకలం
author img

By

Published : Nov 7, 2020, 5:09 PM IST

Updated : Nov 7, 2020, 5:56 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అవకతవతకలు జరుగుతున్నాయంటూ అధ్యక్షుడు డొనాల్ట్​ ట్రంప్​ ఆరోపణలు చేస్తున్న తరుణంలో.. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియలో ఓ వార్త కలకలం సృష్టించింది. భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు.. 'ఫేక్​ బ్యాలెట్​' ఉన్న ఓ ట్రక్​ను ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు.

అమెరికా మీడియా కథనాల ప్రకారం.. అనుమతులు లేకుండా ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఇద్దరిని గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్​ చేశారు. తుపాకులు, ఏఆర్​-రైఫిల్​తో పాటు 160 రౌండ్ల బులెట్లను ట్రక్​ నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి- అమెరికాలో రణం: ఓట్ల లెక్కింపుపై కొనసాగుతున్న నిరసనలు

అయితే ఆ ఫేక్​ బ్యాలెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ట్రక్​లో వాటిని కనుగొన్నారా? అసలు ఆ ఇద్దరు ఏం చేద్దామనుకున్నారు? వంటి ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. ఎఫ్​బీఐతో పాటు ఫిలడెల్ఫియా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

అయితే ఆ ఇద్దరి మధ్య ఫోన్​లో జరిగిన సంభాషణను అధికారులు చూశారు. ఓట్ల లెక్కింపును చూసి ఆందోళన చెందినట్టు, అందుకే ఫేక్​ బ్యాలెట్లను అందివ్వడానికి వారు బయలుదేరినట్టు అధికారులు వెల్లడించారు.

అక్కడా బైడెనే..

అమెరికాలోని స్వింగ్​ స్టేట్స్​లో పెన్సిల్వేనియా ఒకటి. ఇక్కడ తొలుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆధిపత్యంలో ఉన్నప్పటికీ.. ఆయన్ని అధిగమించి విజయంవైపు దూసుకెళుతున్నారు డెమొక్రాట్​ అభ్యర్ధి జోబైడెన్​.

ఇదీ చూడండి:- సుప్రీంలో ట్రంప్​కు ఊరట- పోస్టల్​ ఓట్లపై కీలక తీర్పు

Last Updated : Nov 7, 2020, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.