అమెరికాలోని అర్కన్సాస్ రాష్ట్రంలో క్రిస్మస్ పండుగ రోజు దారుణం జరిగింది. రాష్ట్రంలోని అట్కిన్స్ నగరంలో శుక్రవారం సాయంత్రం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వీరిలో ఒకరు మిగతా నలుగురిని హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ఈమేరకు వివరాలను సోమవారం వెల్లడించారు.
ఇద్దరు మహిళలు.. ముగ్గురు బాలికలు..
ఘటనలో ఇద్దరు మహిళలు, ముగ్గురు బాలికలు మరణించారని అధికారులు తెలిపారు. మృతులు డేనియల్లీ కొలిన్స్ (7), లెవేనాహ్ కంట్రీమ్యాన్ (10), అవిగెయిల్ హెఫ్లిన్ (12), జాక్విటా ఛేస్ (31), పాట్రికా పాట్రిక్ (61)గా గుర్తించారు. ఈ ఘటనకు గల కారణాలు, హత్యకు పాల్పడిన వ్యక్తి ఎవరన్నది వెల్లడించలేదు.
ఇదీ చూడండి : చైనాను ఎదుర్కోవాలంటే అలా చేయాల్సిందే: బైడెన్