అమెరికన్లలో వ్యాక్సిన్ పట్ల అనుమానాలు ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. టీకా తీసుకునే అవకాశం లేదని లేదని ముగ్గురిలో ఒకరు చెబుతున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ, ఎన్ఓఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ సర్వే చేపట్టాయి.
67 శాతం మంది అమెరికన్లు టీకా పట్ల సానుకూలంగా (ఇప్పటికే టీకా తీసుకోవడం లేదా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం) స్పందించారు. 17 శాతం మంది మాత్రం వ్యాక్సిన్ తీసుకోకపోవచ్చని చెప్పారు. మరో 15 శాతం మంది మాత్రం అసలు టీకా వేయించుకోమని తెగేసి చెప్పారు. వ్యాక్సిన్ భద్రత, సమర్థతపైనే ఎక్కువ మంది అనుమానాలు వ్యక్తం చేశారు.
కరోనాను అరికట్టేందుకు 70 నుంచి 85 శాతం మంది జనాభాకు టీకా అందించాల్సి ఉంటుందని అమెరికా అంటువ్యాధుల శాస్త్ర నిపుణుడు ఆంటోనీ ఫౌచీ తెలిపారు.
ఇదీ చదవండి: సురక్షిత టీకాపై సందేహాలు- సమాధానాలు