ETV Bharat / international

'భారత్​-పాక్​ల మధ్య యుద్ధం ప్రపంచానికే పెను ముప్పు'

భారత్-పాక్​ల మధ్య ఏదైన సైనిక చర్య తలెత్తితే వాటితో పాటు ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ అభిప్రాయపడ్డారు. భారత్​-పాక్​ల మధ్య ఉన్న విభేదాలను వీలైనంత త్వరగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

Any military confrontation between India, Pak would be disaster of unmitigated proportion:UN chief
'భారత్​-పాక్​ల మధ్య యుద్ధం ప్రంపచానికి పెను ముప్పు'
author img

By

Published : Jan 29, 2021, 1:33 PM IST

భారత్​-పాకిస్థాన్​ల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు కృషి చేయాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సూచించారు. ఈ దేశాల నడుమ ఏదైనా సైనిక ఘర్షణ తలెత్తితే ఆ రెండు దేశాలతో పాటు ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్​ అంశంలో భారత్-పాక్​ల సంబంధాలపై దాయాది జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు గుటెరస్.

కశ్మీర్​పై ఇరు దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితులు సవ్యంగా ఉన్నట్టు కనిపించట్లేదన్న గుటెరస్.. సైన్యంతో పరిష్కారం ఎంతమాత్రం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. భారత్​-పాక్​లు అంగీకరిస్తే శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు. భారత్-పాక్​ల మధ్య ఉన్న సమస్యలపై కచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.

"చర్చల ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అది అత్యంత అవసరమని నమ్ముతున్నాం. అయితే ఆ చర్చలు భారత్​-పాక్​ సరిహద్దుల్లో.. నియంత్రణ రేఖపై చేపట్టాల్సి ఉందని చెప్పగలను. ఈ ప్రాంతంలో మానవ హక్కులకు గౌరవమివ్వాలి."

- ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి

2019లో కేంద్రం జమ్ముకశ్మీర్​ స్వయంప్రతిపత్తి, ఆర్టికల్​ 370 రద్దు చేసిన తర్వాత భారత్​-పాక్​ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. భారత్​తో దౌత్య సంబంధాలను మరింత తగ్గించిన పాక్.. పాక్​లో భారత హైకమిషనర్​ని వెనక్కి పంపింది. మరోవైపు ఈ విషయం పూర్తిగా అంతర్గత వ్యవహారమని భారత్​ తేల్చిచెప్పింది.

జమ్ముకశ్మీర్ పరిస్థితులపై 2019 ఆగస్టులో గుటెరస్ ప్రకటనపై పాక్ జర్నలిస్ట్ ప్రస్తావించగా.. ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. "పాకిస్థాన్​ పర్యటన సందర్భంగా కశ్మీర్​లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. భారత్​, పాక్​ల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు". ఈ ప్రతిపాదనను తిరస్కరించిన భారత్.. పాకిస్థాన్​ అక్రమంగా ఆక్రమించుకున్న భూభాగం విడుదలపై దృష్టి సారించాలని సూచించింది.

ఇదీ చదవండి: కరోనా టీకా తొలి డోసు తీసుకున్న ఐరాస చీఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.