దాయాది పాకిస్థాన్‌తో కశ్మీర్ అంశంపై ప్రత్యక్ష ద్వైపాక్షిక సంబంధాల ద్వారానే చర్చిస్తామని భారత విదేశాంగ మంత్రి జయ్శంకర్ తెలిపారు. థాయ్‌లాండ్‌లో 9వ తూర్పు ఆసియా విదేశాంగ మంత్రుల శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇందులో భాగంగా అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపియోతో భేటీ అయ్యారు జయ్శంకర్. కశ్మీర్ అంశంలో అగ్రరాజ్య జోక్యాన్ని సున్నితంగా తిరస్కరించారు.
"కశ్మీర్ అంశంలో ఏదైనా చర్చించాల్సి వస్తే పాకిస్థాన్‌తో ద్వైపాక్షికంగానే ముందుకు వెళతాం."
- జయ్శంకర్, విదేశీ వ్యవహారాల మంత్రి
అమెరికా విదేశాంగ మంత్రి పాంపియోతో పలు సమస్యలపై చర్చించినట్లు జయ్శంకర్ ట్వీట్ చేశారు.
కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన తర్వాత ఇరువురు విదేశాంగ మంత్రులు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ట్రంప్ ఏమన్నారు..?
కశ్మీర్ అంశమై మధ్యవర్తిత్వం వహించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్లు ట్రంప్ ఉద్ఘాటించారు. జపాన్ ఒసాకాలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశం వేదికగా మోదీ ఈ మేరకు కోరారని తెలిపారు.
ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించగా.. దాయాది పాకిస్థాన్ స్వాగతించింది.
ఇదీ చూడండి: 'ఎన్ఎంసీ' బిల్లుపై నిరసనల సెగ- నిలిచిన సేవలు