ETV Bharat / international

మెహుల్​ చోక్సీపై ఆంటిగ్వా వైఖరేంటి?

author img

By

Published : Jun 4, 2021, 12:23 PM IST

Updated : Jun 4, 2021, 12:42 PM IST

మెహుల్​ చోక్సీ అప్పగింతపై ఆంటిగ్వా ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. డొమినికాలోని చోక్సీని నేరుగా భారత్​కు పంపడానికే ఆంటిగ్వా ప్రాధాన్యం ఇస్తోందని తెలిపింది. చోక్సీ పరారీ సహా అప్పగింతపై పెండింగ్​లో ఉన్న కేసులను వేగవంతం చేశామని వెల్లడించింది.

antigua repatriation of Choksi, మెహుల్​ చోక్సీ డొమినికా
మెహుల్​ చోక్సీ అప్పగింతపై ఆంటిగ్వా కీలక వ్యాఖ్యలు

డొమినికాలో పట్టుబడ్డ మెహుల్ చోక్సీని నేరుగా భారత్​కు తిరిగి అప్పగించడానికే ఆంటిగ్వా ప్రాధాన్యం ఇస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం జరిగిన కేబినెట్​ సమావేశంలో ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టతకు వచ్చినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రధాని గాస్టన్ బ్రౌనీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆంటిగ్వా నుంచి చోక్సీ డొమినికాకు పరారుకావడంపై చర్చించారని పేర్కొంది.

చోక్సీ పౌరసత్వం రద్దు, భారత్​కు అప్పగింతపై పెండింగ్​లో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేస్తామని ఆంటిగ్వా సమాచార శాఖ మంత్రి మెల్​ఫర్డ్​ నికోలెస్​ తెలిపారు. అయితే చోక్సీ పరారీలో ఓ మహిళ హస్తం ఉందన్న ఆరోపణలపై వివరాలు వెల్లడించడానికి మంత్రి నిరాకరించారు.

'చోక్సీని తప్పకుండా తీసుకువస్తాం'

మెహుల్​ చోక్సీని డొమినికా నుంచి భారత్​కు తిరిగి రప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది.

డొమినికాలోకి అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణలపై ప్రస్తుతం చోక్సీని ఆ దేశ హైకోర్టు విచారిస్తోంది. చోక్సీ దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​ను కూడా కోర్టు తిరస్కరించింది. పీఎన్​బీ కుంభకోణంలో నిందితులుగా ఉన్నారు చోక్సీ.

విమానం బయలుదేరింది..

చోక్సీని తిరిగి రప్పించేందుకు డొమినికాకు చేరిన భారత బృందం తిరుగు ప్రయాణమైంది. ఖతర్​ ఎయిర్​వేస్​కు చెందిన ప్రైవేట్​ విమానంలో బృందం భారత్​ చేరనుంది. ఏ7సీఈఈ పేరుతో ఉన్న ఈ విమానంలో మే 28న భారత్ బృందం​ డొమినికాకు ప్రయాణమయింది.

ఇదీ చదవండి : Mehul Choksi: దిల్లీలో దిగగానే చోక్సీ అరెస్ట్​?

Last Updated : Jun 4, 2021, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.