కరోనా నిర్ధరణ పరీక్షల విశ్వసనీయతపై సర్వత్రా అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ పరీక్షలకు సంబంధించి కీలక అంశాన్ని బయటపెట్టింది అమెరికా మెడికల్ అసోసియేషన్ జర్నల్ (జామా). ప్రస్తుతం వినియోగిస్తున్న పరీక్షా విధానాలతో పోలిస్తే యాంటీబాడీ టెస్టుల ద్వారా 10 రెట్లు ఎక్కువగా కేసులు నిర్ధరణ అవుతున్నాయని వెల్లడించింది. గత జూన్లో అమెరికా సీడీసీ నిర్వహించిన పరిశోధనలో వైరస్ కేసులను అతిస్వల్పంగా చూపినట్లు వెల్లడించింది.
మార్చి చివరి వారం నుంచి మే ప్రారంభం వరకు అమెరికాలో నిర్ధరణ అయిన కేసులతో పోలిస్తే వాస్తవంగా 10 రెట్లకు మించి వైరస్ కేసులు పెరిగాయని వెల్లడించింది. 10 రాష్ట్రాల్లోని 16,000 వేలమందికి నిర్వహించిన యాంటీబాడీ టెస్టుల ఆధారంగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది పరిశోధన బృందం.
స్వల్ప అస్వస్థతకు గురైనవారు, లక్షణాలు లేనివారిలో యాంటీబాడీ టెస్టుల ద్వారా వైరస్ను గుర్తించారు. కనెక్టికట్లో 6 రెట్లు, మిస్సౌరీలో 24 రెట్లు వైరస్ కేసులు నమోదయినట్లు స్పష్టం చేసింది నివేదిక.
ఇదీ చూడండి: గుడ్న్యూస్: అక్టోబరు కల్లా ఆక్స్ఫర్డ్ టీకా