ETV Bharat / international

వారిలో వేగంగా తగ్గుతున్న యాంటీబాడీలు! - COVID Antibodies

కరోనా నుంచి కోలుకుంటున్నవారిలో యాంటీబాడీలు వేగంగా తగ్గిపోతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. శరీరంలో కరోనా ఆనవాళ్లు, లక్షణాలు తగ్గుతున్నా కొద్దీ యాంటీబాడీల స్థాయి పడిపోతోందని వెల్లడైంది. ఈ పరిశోధన సారాంశం ఎంబయో జర్నల్​లో ప్రచురితమైంది.

Antibodies fade quickly in recovering COVID-19 patients, study finds
వారిలో వేగంగా తగ్గుతున్న యాంటీబాడీలు!
author img

By

Published : Oct 19, 2020, 3:44 PM IST

కరోనా నుంచి కోలుకుంటున్న బాధితుల్లో యాంటీబాడీలు త్వరగా కనుమరుగవుతున్నాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. రోగుల శరీరంలో కరోనా ఆనవాళ్లు, లక్షణాలు క్రమంగా తగ్గుతున్నా కొద్దీ రక్తంలో యాంటీబాడీల స్థాయి పడిపోతోందని తేలింది.

ఈ నేపథ్యంలో కరోనా రోగుల చికిత్స కోసం ప్లాస్మాను నిర్దిష్ట సమయంలో సేకరించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఈ పరిశోధన సారాంశం ఎంబయో జర్నల్​లో ప్రచురితమైంది.

"హోస్ట్ కణాలను గుర్తించి దాడి చేయడంలో సార్స్​-కోవ్-2 స్పైక్ ప్రోటీన్ కీలకంగా వ్యవహరిస్తుంది. శరీర రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే యాంటీబాడీలు ఈ ప్రోటీన్​తో కలిసి వైరస్ సామర్థ్యాన్ని అడ్డుకొని, వైరల్ కణాలు హోస్ట్ కణానికి సోకకుండా నిరోధిస్తాయి. అయితే, వైరస్ కణాలను తటస్థం చేసే ప్లాస్మా సామర్థ్యం మొదటి కొన్ని వారాల్లో తగ్గుతోందని మా అధ్యయనం నిరూపించింది."

-ఆండ్రెస్ ఫింజి, మోంట్రేల్ యూనివర్సిటీ, కెనడా

ఇదివరకు నిర్వహించిన అధ్యయనాల్లో సార్స్​-కోవ్-2 స్పైక్ ప్రోటీన్​కు వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీలు శరీరంలో రెండు, మూడు వారాల పాటు గరిష్ఠ స్థాయిలో ఉంటాయని తేలింది. దీనిపై గతంలో ఫింజి బృందం 100 మంది రోగులపై క్రాస్ సెక్షనల్ అధ్యయనం నిర్వహించారు. వైరస్​ను తటస్థం చేసే ప్లాస్మా సామర్థ్యం.. లక్షణాలు కనిపించిన తర్వాత 3-6 వారాల మధ్య తగ్గిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

అయితే.. తాజాగా ఫింజి బృందం చేపట్టిన లాంగిట్యుడినల్ సర్వేలో కొవిడ్ నుంచి కోలుకుంటున్న 31 మంది వ్యక్తుల రక్త నమూనాలపై విస్తృత అధ్యయనం చేశారు. కరోనావైరస్ ఎస్​ ప్రోటీన్​కు వ్యతిరేకంగా పనిచేసే ఇమ్యునోగ్లోబులిన్స్​ స్థాయిలను లెక్కించారు. ఎంజైమ్ ఉపరితలం లక్ష్యంగా పనిచేసే జీ, ఏ, ఎం ఇమ్యునోగ్లోబులిన్స్​ స్థాయిలు.. లక్షణాలు మొదలైన 6 నుంచి 10 వారాల మధ్య తగ్గిపోయినట్లు గుర్తించారు. ఇదే సమయంలో వైరస్​ను తటస్థం చేసే యాంటీబాడీల సామర్థ్యం కూడా పడిపోయినట్లు కనుగొన్నారు.

వ్యాక్సిన్ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు...

కాలానుగుణంగా యాంటీబాడీల సామర్థ్యంలో వస్తున్న మార్పులను గుర్తించడం అత్యంత ఆవశ్యకమని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాస్మా చికిత్స కోసం రక్తాన్ని సేకరించడం సహా, వ్యాక్సిన్ సామర్థ్యాన్ని స్పష్టంగా గుర్తించేందుకు ఇది అవసరమని వెల్లడించారు. ఇప్పటికే కరోనా సోకిన రోగులకు మళ్లీ వైరస్ వ్యాపించే ప్రమాదాన్ని అంచనా వేసేందుకు కూడా యాంటీబాడీల సామర్థ్యంలో మార్పులు దోహదం చేస్తాయని తెలిపారు.

ఇదీ చదవండి- బిహార్​లో యోగికి క్రేజ్​- కీలక స్థానాల్లో ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.