ETV Bharat / international

కరోనా పుట్టుకపై ఫౌచీ అనుమానాలు - సార్స్‌కోవ్‌-2 వైరస్‌

కొవిడ్ సహజంగా వృద్ధి చెందిందంటే నమ్మకం కుదరడంలేదని అమెరికాలోని అంటువ్యాధుల చికిత్సా నిపుణుడు ఆంటోనీ ఫౌచీ చెప్పారు. వైరస్​ పుట్టుకపై దర్యాప్తు కొనసాగింపునకు ఆయన మద్దతు పలికారు.

Anthony Fauci 'not convinced' Covid-19 developed naturally
ఆంటోని ఫౌచీ
author img

By

Published : May 24, 2021, 9:49 PM IST

సార్స్‌కోవ్‌-2 వైరస్‌ సహజంగా వృద్ధి చెందిందంటే ఒక పట్టాన నమ్మకం కలగడంలేదని.. దానిపై దర్యాప్తు నిర్వహించాలని అమెరికాకు చెందిన అంటువ్యాధుల చికిత్సా నిపుణుడు ఆంటోని ఫౌచీ పేర్కొన్నారు. ఆయన 'యునైటెడ్‌ ఫాక్ట్‌ ఆఫ్‌ అమెరికా: ఎ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌చెకింగ్‌' అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా.. 'మీరు ఇంకా కరోనావైరస్‌ సహజంగా వచ్చిందనే నమ్ముతున్నారా?' అని ప్రశ్నించగా ఆయన స్పందించారు.

"నాకు దానిపై నమ్మకం కలగటంలేదు. మనం చైనాలో ఏం జరిగిందనేదానిపై శక్తికొద్దీ దర్యాప్తు నిర్వహించి ఒక నిర్ణయానికి రావాలి. ముఖ్యంగా ఇప్పటికే దీని గురించి తనిఖీ చేసినవారు మాత్రం ఇది జంతువుల నుంచే మనుషులకు సోకినట్లు చెబుతున్నారు. కానీ, ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉంది.. దానిని వెలికి తీయాలి. అందుకే వైరస్‌ పుట్టుక తెలుసుకొనేందుకు ఎప్పుడూ పారదర్శకమైన దర్యాప్తునకు నేను మద్దతు ఇస్తాను"

-ఆంటోని ఫౌచీ, అంటువ్యాధుల చికిత్సా నిపుణుడు

ల్యాబ్‌ నుంచి లీక్‌ కాలేదని వస్తున్న వాదనలపై ప్రశ్నించగా ఫౌచీ ఆచితూచి స్పందించారు. తాను చైనాలో ఏం జరిగిందనే అంశంపై దర్యాప్తును కొనసాగించడానికి మద్దతు ఇస్తానని తెలిపారు. ల్యాబ్‌ నుంచి లీక్ అయిందనే వాదనను ఆయన కొట్టిపారేయలేదు. కాకపోతే వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో 'గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్స్‌' ప్రయోగాలకు (వైరస్‌లలో మార్పులు చేసే ప్రక్రియ) ఎన్‌ఐహెచ్‌, ఎన్‌ఐఏఐడీ సంస్థల నుంచి నిధులు మాత్రం వెళ్లలేదని ఆయన పునరుద్ఘాటించారు.

గతేడాది ఈ వైరస్‌ ల్యాబ్‌ నుంచి లీక్ అయిందని డాక్టర్‌ ఫౌచీ అన్నాడు. జన్యుమార్పిడితో తయారు చేశారనే వాదనలను చాలాసార్లు కొట్టిపారేశారు. మరోపక్క శ్వేత సౌధం కూడా ల్యాబ్‌లీక్‌ సిద్ధాంతానికి ఆధారాలు లేవని కొట్టిపారేయటం లేదు. కాకపోతే స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని కోరుతోంది.

ఇదీ చూడండి: వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా- 'అగ్రరాజ్యం' నివేదిక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.