ETV Bharat / international

చైనా దిగుమతులపై మరిన్ని సుంకాలు విధించిన అమెరికా - డ్రాగన్​

అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే పలు డ్రాగన్​ దిగుమతులపై సుంకాలు విధించిన ట్రంప్ సర్కారు.. తాజాగా మరికొన్ని ఉత్పత్తులపై 15శాతం సుంకాలు విధించింది.

మరోసారి చైనాపై పదిహేను శాతం సుంకాలు పెంచిన అమెరికా
author img

By

Published : Sep 1, 2019, 4:09 PM IST

Updated : Sep 29, 2019, 1:57 AM IST

చైనాపై మరోసారి సుంకాల మోత మోగించింది ట్రంప్ సర్కారు. ఆహార పదార్థాలు, క్రీడా సామగ్రి, సంగీత వాయిద్యాలు, గృహోపకరణాలపై కొత్తగా 15 శాతం సుంకాలు విధించింది. అమెరికాతో కొత్త వాణిజ్య ఒప్పందం చేసుకునే విధంగా బీజింగ్​పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తెలిపారు. శ్వేతసౌధం తాజా నిర్ణయంతో దాదాపు 300 అమెరికన్​ బిలియన్​ డాలర్ల విలువైన చైనా వస్తువులపై ప్రభావం పడనుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం అంచనా వేసింది. తాజాగా విధించిన సుంకాలు ఆదివారం ఉదయం నుంచే అమలులోకి వచ్చాయి.

ఈ ఏడాది చివరికల్లా అన్ని చైనా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని అమెరికా గతవారమే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. చైనా దిగుమతులపై మరికొద్ది రోజులు సుంకాలు పెంచకూడదని కోరిన అమెరికా సంస్థలపై విరుచుకుపడ్డారు ట్రంప్​. వందలాది సంస్థలు తమ అసమర్థ నిర్వహణను గుర్తించేందుకు బదులు తెలివిగా సుంకాలను తప్పుపడుతున్నాయని ట్వీట్​ చేశారు. సుంకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసేది లేదన్న అమెరికా అధ్యక్షుడు ఈ నెలలో డ్రాగన్​ దేశంతో జరగనున్న చర్చలు సఫలం చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

" చైనాతో మేము చర్చలు జరుపుతున్నాం. సమావేశం జరిగేందుకు సమయం ఖరారైంది. ఇరుదేశాల మధ్య సెప్టెంబర్​లో జరగాల్సిన సమావేశంలో ఏ మార్పు ఉండదని అనుకుంటున్నా. అది రద్దు అవదని భావిస్తున్నా. చూద్దాం ఏం జరుగుతుందో."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ఇదీ చూడండి : మన్మోహన్​ విమర్శలను స్వీకరిస్తున్నా : నిర్మలా సీతారామన్​

RESTRICTION SUMMARY: MUST ON-SCREEN CREDIT TO TELEWIZJA POLSKA AT THE END OF EACH TRANSMISSION, USAGE/RIGHTS FOR 2 YEARS/NO RESALE/NO NEW USE AFTER SEPTEMBER 1ST 2021
SHOTLIST:
TVP TELEWIZJA POLSKA - MUST ON-SCREEN CREDIT TO TELEWIZJA POLSKA AT THE END OF EACH TRANSMISSION, USAGE/RIGHTS FOR 2 YEARS/NO RESALE/NO NEW USE AFTER SEPTEMBER 1ST 2021
Warsaw – 1 September 2019
1. US Vice President Mike Pence and Second Lady Karen Pence leaving plane, waving and receiving flowers
2. Delegation and airplane
3. Pence shaking hands and talking with officials
4. Delegation and airplane
5. Various of Pence and his wife walking to limousine
6. Various of limousine leaving
STORYLINE:
US Vice President Mike Pence and the Second Lady Karen Pence arrived in Warsaw on Sunday morning to attend a ceremony commemorating the 80th anniversary of the start of World War II in the Polish capital.
German Chancellor Angela Merkel and many other leaders will also attend the main event in Warsaw.
President Donald Trump canceled his arrival to deal with Hurricane Dorian approaching Florida.
The invasion of Poland by Nazi German troops on September 1 1939 marks the outbreak of World War II.
Poland remained under German occupation for more than five years. It lost around 6 million citizens and suffered damaged towns, villages and industry.
Today Germany is Poland's closest partner in the EU and also in trade and economy.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 1:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.