ETV Bharat / international

ట్రంప్‌ మాటలు బేఖాతరు- చైనాపై డబ్ల్యూహెచ్​ఓ పొగడ్తలు - డబ్ల్యూహెచ్​ఓ

ప్రపంచంపై కరోనా మహమ్మారి పంజా విసరడానికి చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్, ఇతర దేశాలు​ విమర్శలు చేస్తూనే ఉన్నాయి. అయితే.. వైరస్​ను కట్టడి చేయటంలో చైనా అద్భుత ప్రదర్శన కనబరిచిందని డబ్ల్యూహెచ్​ఓ ప్రశంసించటం గమనార్హం. సమాజం మళ్లీ సాధారణ స్థితికి ఎలా చేరుకుందో వుహాన్​ను చూసి ప్రతి దేశం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.

WHO
చైనాపై డబ్ల్యూహెచ్​ఓ ప్రశంసలు
author img

By

Published : May 2, 2020, 2:26 PM IST

కరోనా వైరస్‌ను చైనా అద్భుతంగా కట్టడి చేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించింది. సమాజం మళ్లీ సాధారణ స్థితికి ఎలా చేరుకుందో వుహాన్‌ను చూసి ప్రతి దేశం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అక్కడ కొత్త కేసులేవీ నమోదు కాకపోవడం సంతోషకరమని వ్యాఖ్యానించింది.

వుహాన్‌ నగరంలోనే మొట్టమొదట కరోనా వెలుగుచూసింది. అక్కడి నుంచి ప్రపంచమంతా పాకేసింది. వైరస్‌ వ్యాప్తితో దాదాపు సగం ప్రపంచం ఆంక్షల మధ్యే జీవిస్తోంది. ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా సరైన సమయంలో సంపూర్ణ వివరాలు ఇవ్వలేదని, మహమ్మారిని నియంత్రించడం, ఇతర దేశాలను హెచ్చరించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శించారు. బీజింగ్ యంత్రాంగం మరింత పారదర్శకంగా ఉండాల్సిందని అనేక దేశాలు అంటున్నాయి.

వుహాన్‌లో కరోనా కేసులు సంఖ్య సున్నాకు చేరడంపై డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి మరియా వాన్‌ కెర్‌ఖోవె చైనాను అభినందించారు. 'వుహాన్‌లో కరోనా రోగులు లేకపోవడం, ప్రమాదకర కేసులేమీ లేవని తెలియడం స్వాగతించదగ్గ విషయం. ఈ ఘనత సాధించినందుకు అభినందనలు’ అని మరియా పేర్కొన్నారని చైనా అధికార మీడియా సంస్థ షిన్హువా తెలిపింది.

మరియా రెండు వారాల పాటు చైనాలో క్షేత్రస్థాయి అధ్యయనానికి వెళ్లి స్థానిక వైద్య బృందాలు, యంత్రాంగంతో కలిసి పనిచేశారు.

"ఆంక్షలు ఎలా ఎత్తేయాలో, సమాజాన్ని సాధారణ స్థితికి లేదా సరికొత్త సాధారణ స్థితికి ఎలా తీసుకురావాలో వుహాన్‌ను చూసి ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సిన అవసరముంది. నేనక్కడ రెండు వారాలు పనిచేశాను. కేసుల సంఖ్య తగ్గించేందుకు ఏం చేశారో చూశాను. వారు అవిశ్రాంతంగా శ్రమించారు. ఆరోగ్య సిబ్బందికే కాదు ఇంట్లో ఉండి సహకరించిన వుహాన్‌ ప్రజలకు మా అభినందనలు. మీ అనుభవాన్ని ప్రపంచంతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఏదేమైనప్పటికీ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి."

-మరియా వాన్‌ కెర్‌ఖోవె, డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.