'గ్లీసన్ బాక్సింగ్ వ్యాయామశాల'... అమెరికాలోనే అతి పురాతనమైనది. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ డంబో పరిసరాల్లో ఉన్న ఈ జిమ్ 1937లో ప్రారంభమైంది. బ్రూస్ సిల్వర్‌గ్లేడ్ అనే వ్యక్తి 40 ఏళ్లుగా దీని నిర్వహణ చూస్తున్నారు.
దశాబ్దాల చరిత్ర గల ఈ జిమ్ సెంటర్ ఎంతో మంది ప్రపంచ ఛాంపియన్లను అందించింది. రింగ్‌లో అత్యంత ప్రమాదకరమైన మహమ్మద్ అలీ, మైక్ టైసన్‌లను గ్లీసన్ జిమ్ తీర్చిదిద్దింది. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన హాలీవుడ్ సినిమాలు 'ర్యాగింగ్ బుల్', 'మిలియన్ డాలర్ బేబీ'ల చిత్రీకరణ ఇందులోనే జరిగింది.
ఈ వ్యాయామశాలను ప్రారంభించి 82 ఏళ్లయింది. అయినప్పటికీ ఇందులో 1200మంది శిక్షణ పొందుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.
"ఈ జిమ్ ప్రారంభమైనప్పటి నుంచి 136మంది ప్రపంచ ఛాంపియన్లను అందించింది. 'జేక్లా మోట్టా'తో మా విజయ ప్రస్థానం ఆరంభమైంది. ప్రస్తుతం ఇక్కడ ఏడుగురు అత్యుత్తమ బాక్సర్లకు శిక్షణనిస్తున్నాం. వారందరూ మహిళలే... ఇంత మంది మహిళలు ఒకేసారి శిక్షణనివ్వడం చరిత్రలో ఇదే తొలిసారి. విజయం కోసం వారు తీవ్రంగా శ్రమిస్తూ, తర్ఫీదు పొందుతున్నారు."
- బ్రూస్ సిల్వర్‌గ్లేడ్, గ్లీసన్ బాక్సింగ్ జిమ్ యజమాని
ఇదీ చూడండి: రివ్యూ 2019: నరమేధం నుంచి నోబెల్ శాంతి బహుమతి వరకు