వరుసగా రెండో నెలలోనూ భారీ సంఖ్యలో అమెరికన్లు తమ ఉద్యోగాలను (Americans quit their jobs) వదులుకున్నారు. సెప్టెంబర్లో 44 లక్షల మంది ఉద్యోగాల నుంచి దిగిపోయారని (Americans quit jobs) అమెరికా కార్మిక శాఖ వెల్లడించింది. దేశంలోని మొత్తం శ్రామిక వర్గంలో ఇది 3 శాతం కావడం గమనార్హం. ఆగస్టులోనూ 43 లక్షల మంది తమ ఉద్యోగాలను (US workers quitting jobs) వదిలేశారు.
పెద్ద సంఖ్యలో కార్మికులు.. కొత్త అవకాశాల కోసమే ప్రస్తుత ఉద్యోగాన్ని (Americans quit their jobs) వదిలేస్తున్నారు. అధిక వేతనం లభించే మార్గాల వైపు దృష్టిసారిస్తున్నారు.
భారీగా ఉద్యోగాలు వదులుకుంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఖాళీల సంఖ్య (US job openings) రికార్డు స్థాయిలో పెరుగుతోంది. మొత్తంగా కోటి 4 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. రిటైలర్లకు, డెలివరీ కంపెనీలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరమవుతున్నారు. శీతాకాల సెలవులు, క్రిస్మస్ సీజన్ ఉన్న నేపథ్యంలో అనేక సంస్థలు అదనంగా ఉద్యోగులను చేర్చుకుంటున్నాయి.
ఇదీ చదవండి: ఐటీ నిపుణులకు గిరాకీ- అధిక జీతాలిచ్చేందుకు కంపెనీలు సిద్ధం!