చైనా విధించిన జాతీయ భద్రతా చట్టానికి ప్రతిగా హాంకాంగ్‌లో తమ ఆంక్షలు ఎదుర్కొంటున్న అధికారులతో అమెరికన్లు ఎలాంటి లావాదేవీలు జరపరాదని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు వారితో ఎటువంటి వాణిజ్య సంబంధాలు పెట్టుకోరాదని స్పష్టం చేసింది యూఎన్ ట్రెజరీ విభాగం స్పష్టం చేసింది.
ఈ చర్యతో.. ఆంక్షలు ఎదుర్కొంటున్న అధికారుల యూఎస్ ఆధారిత ఆస్తులను సీజ్ చేసే అవకాశం కలగనుంది. ఇంకా.. వారితో అమెరికన్లు జరిపే వ్యాపార కార్యకలాపాలపైనా నిషేధం పడింది.
హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ సహా మరో 10 మంది స్థానిక అధికారులపై అమెరికా విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం గత నెలలోనే ఆంక్షలు విధించింది.
అమెరికా నిర్ణయాన్ని హాంకాంగ్ అధికార ప్రతినిధి తప్పుబట్టారు. ఆంక్షలు అర్థరహితమని మండిపడ్డారు. ఇది అమెరికా.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని ధ్వజమెత్తారు.
హాంకాంగ్‌లోని తమ వ్యతిరేక శక్తులను అణగదొక్కి, పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించేందుకు.. ఆ దేశంపై జాతీయ భద్రతా చట్టాన్ని అమలుచేసింది చైనా.