భారత్‌లో గుర్తించిన కరోనా కొత్తరకం వేరియంట్ బి-1617పై అమెరికా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తాయని ఆ దేశ వైద్యనిపుణులు తెలిపారు.
"మనం వినియోగిస్తున్న వ్యాక్సిన్లు 617 స్ట్రెయిన్లపైనా ప్రభావం చూపే విధంగా ఉన్నాయి. భారత్‌లో గుర్తించిన బి-1617, బి-1618 వేరియంట్లనూ ఈ వ్యాక్సిన్లు సమర్థవంతంగా ఎదుర్కొంటాయి."
- ఆంటోనీ ఫౌచీ, అమెరికా అంటువ్యాధుల నిపుణుడు
ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు ఫౌచీ. అమెరికాలో అభివృద్ధి చేసిన టీకాలు భారత వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తాయని కొవిడ్-19 సీనియర్ సలహాదారు ఆండీ స్లావిట్ తెలిపారు.
భారత్‌లో వెలుగు చూసిన బి-1617 రకాన్ని ఆందోళనకర వేరియంట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
ఇదీ చదవండి : అప్పటి వరకు టీకా ఎగుమతులు లేనట్లే!