అమెరికా మిచిగాన్ పాఠశాలలో తోటి విద్యార్థులపై 15 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ఒక ఉపాధ్యాయుడు సహా మరో ఆరుగురు గాయపడ్డారు. డెట్రాయిట్ అనే ప్రాంతంలోని ఆక్స్‌ఫర్డ్ టౌన్‌షిప్ హైస్కూల్‌లో ఈ దాడి జరిగింది. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందని భద్రతాధికారి మైక్ మెక్‌కేబ్ తెలిపారు. ఇక ఈ ఉదంతానికి పాల్పడిన విద్యార్థి ఈరోజు స్కూల్‌కి రాలేదని ఉపాధ్యాయులు చెప్పారు.
మధ్యాహ్నం 12:55 గంటల సమయంలో పాఠశాలలో కాల్పులు జరుగుతున్నట్లు అత్యవసర నెంబర్ 911కు ఫోన్‌కాల్స్ వెల్లువెత్తాయని అధికారులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్దనుంచి ఆటోమేటిక్ హ్యాండ్‌గన్ సహా పలు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పాఠశాలలోకి తుపాకీని ఎలా తీసుకొచ్చాడనే విషయాన్ని ఆరాతీస్తున్నారు. అయితే.. ఈ ఘటనలో మరణించిన, గాయపడిన వారి పేర్లను అధికారులు వెల్లడించలేదు.
మరోవైపు.. దాడి అనంతరం పాఠశాలలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. భయంతో గదుల్లోకి వెళ్లి దాక్కున్న విద్యార్థులను విడిపించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మధ్యకాలంలో పాఠశాలలో ఇతర విద్యార్థులతో గొడవలు జరుగుతున్నాయని తమ కుమారుడు తెలిపినట్లు దాడికి పాల్పడిన బాలుడి తల్లిదండ్రులు చెప్పడం గమనార్హం.
ఇవీ చదవండి: