భారత్ కొనుగోలు చేస్తోన్న బహుళార్థక ఎంహెచ్-60 రోమియో సీహాక్ హెలికాప్టర్ల తొలి చిత్రాన్ని విడుదల చేసింది అమెరికాకు చెందిన తయారీ సంస్థ లాక్హీడ్ మార్టిన్. జాతీయ జెండా రంగులు ముద్రించిన హెలికాప్టర్ ఫొటోను షేర్ చేసింది.

24 ఎంహెచ్-60 రోమియో మల్టీ రోల్ హెలికాప్టర్లను.. ఇరు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు అమెరికా నుంచి కొనుగోలు చేస్తోంది భారత్. ఈ ఒప్పందం విలువ సుమారుగా 2.4 బిలియన్ డాలర్లు(రూ.16,320 కోట్లు).
ప్రస్తుతం అమెరికా నావికాదళం ఉపయోగిస్తోన్న ఈ బహుళార్థక ఎమ్హెచ్-60 'రోమియో' సీహాక్ శ్రేణిని ప్రపంచంలోనే అత్యుత్తమ మారిటైమ్ హెలికాప్టర్లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఈ 'రోమియో' సీహాక్ హెలికాప్టర్లు యాంటీ-సబ్మెరైన్, యాంటీ-సర్ఫేస్ వార్ఫేర్, నిఘా, సమాచార వ్యవస్థలు, రక్షణ, సహాయక చర్యలకు, నావికా యుద్ధాల్లో వినియోగించేందుకు అనువైనవి.
ఇదీ చూడండి: భారత్కు 'రోమియో'లు- అమెరికా ఆమోదం