అరేబియా సముద్రంలో అమెరికా రష్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రష్యా యుద్ధనౌక.. అమెరికా యుద్ధ నౌకను దూకుడుగా వెంబడించింది. అమెరికా యుద్ధ నౌక నుంచి వచ్చిన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. రష్యా యుద్ధ నౌక దూసుకు వచ్చింది.
రష్యా యుద్ధ నౌక అమెరికా యుద్ధ నౌకకు 180 అడుగుల సమీపానికి వచ్చిందని... అగ్రరాజ్య రక్షణా అధికారులు ప్రకటించారు. రష్యా యుద్ధ నౌక సమీపానికి దూసుకొస్తున్నప్పుడు.. అయిదుసార్లు అత్యవసర అలారం మోగించామని అమెరికా ప్రకటించింది. రష్యా నౌక స్పందించపోయేసరికి సముద్ర సంకేతాలు కూడా పంపామని తెలిపింది అగ్రరాజ్యం.
అతి సమీపానికి వచ్చిన తర్వాత రష్యా యుద్ధ నౌక తన మార్గాన్ని మార్చుకుంది. రష్యాది రెచ్చగొట్టే చర్య అని అమెరికా అధికారులు విమర్శించారు. ఏడు నెలల క్రితం పసిఫిక్ మహా సముద్రంలోనూ అమెరికా-రష్యా యుద్ధ నౌకలు ఇలాగే సమీపానికి వచ్చి దూకుడుగా వ్యవహరించాయి.
ఇదీ చదవండి:సెకన్లలోనే... 19 అంతస్తుల భవనాన్ని కూల్చారు