ETV Bharat / international

అమెరికా రగిలించిన రావణకాష్ఠం- అఫ్గానిస్థాన్​ - తాలిబన్లతో అమెరికా చర్చలు

అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ను హతమార్చిన తర్వాత ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు ఆసక్తి సన్నగిల్లిపోయింది. తాలిబన్లతో రోజూ తలపడాల్సి రావడం వల్ల విసిగి వేసారిపోయింది. చర్చల ద్వారా అఫ్గానిస్థాన్‌లోంచి బయటపడాలని తలపోసింది. అయితే.. ఇక్కడే అమెరికా వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. తమ బలగాల నిష్క్రమణతో తలెత్తే భయంకర పరిస్థితులను అగ్రరాజ్యం సరిగ్గా అంచనా వేయలేకపోయింది.

taliban in afghan
అఫ్గాన్​లో తాలిబన్లు
author img

By

Published : Aug 18, 2021, 7:19 AM IST

ఎవరి ఊహలకూ అందనంత తుపాను వేగంతో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్‌ సాయుధ మూకలు హస్తగతం చేసుకొన్నాయి. దాంతో అమెరికా మద్దతుతో ఇరవై ఏళ్లుగా కొనసాగుతున్న పౌర ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయి. అంతకు మునుపే అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశం విడిచిపెట్టేశారు. రక్తపాతాన్ని నివారించేందుకే తాను ఆ నిర్ణయం తీసుకొన్నానని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. ప్రజలందరికీ 'క్షమాభిక్ష' ప్రసాదించామని ప్రకటించిన తాలిబన్లు- ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకొంటున్నారు. అమెరికా జంట భవనాలపై ఉగ్రదాడి దరిమిలా రెండు దశాబ్దాల క్రితం వారు అధికారాన్ని కోల్పోయారు. అల్‌ఖైదాను, దానికి అండగా నిలబడ్డ తాలిబన్లను అణచివేసి.. ఉగ్రవాద భూతం నుంచి శాశ్వత స్వేచ్ఛను సాధిస్తామంటూ అఫ్గానిస్థాన్‌పై అప్పట్లో అగ్రరాజ్యం కాలుమోపింది. ప్రతీకారానికి కాలుదువ్వి ఇన్నేళ్ల పాటు యుద్ధంలో తలమునకలైన అమెరికా చివరికి సాధించింది ఏమీ లేదు. అది చాలదన్నట్లుగా ప్రణాళికారహితంగా బలగాలను ఉపసంహరించుకొని, అఫ్గాన్‌ను చేజేతులా తాలిబన్లకు అప్పగించింది!

ఆది నుంచీ నమ్మకద్రోహమే...

గడచిన ఇరవై ఏళ్లలో మూడు లక్షల మందికి పైగా అఫ్గాన్‌ సైనికులు, పోలీసులకు అమెరికా శిక్షణ అందించింది. అత్యాధునిక ఆయుధాలనూ సమకూర్చింది. అయినా వారు ఏమాత్రం పోరాడకుండా తాలిబన్లకు లొంగిపోయారు. అమెరికా సేనలు అర్ధరాత్రి వేళలో మూటాముల్లే సర్దేయడంతో అఫ్గాన్‌ దళాల ఆత్మస్థైర్యం దెబ్బతింది. నిఘా విభాగాధిపతి అమ్రుల్లా సలేహ్‌తో కలిసి అధ్యక్షుడు ఘనీ పలాయనం చిత్తగించడంతో అఫ్గాన్‌ బలగాలు జావగారిపోయాయి. తాలిబన్‌ తండాలపై పౌర ప్రభుత్వం చేసిన ప్రధాన దాడులన్నింటికీ అమ్రుల్లాయే ప్రధాన సూత్రధారి కావడం గమనార్హం. తాలిబన్లను ఎదుర్కోవడానికి సైనిక, నిఘా వ్యవస్థలను నిర్మించిన అహ్మద్‌ షా మసూద్‌(కమాండర్‌ మసూద్‌)కు అమ్రుల్లా సలేహ్‌ అత్యంత సన్నిహితుడు. మసూద్‌ మాదిరిగానే ఆయన తాలిబన్లను తుదికంటా వ్యతిరేకించారు. కానీ, అమెరికన్ల చేతుల్లో చాలాసార్లు చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. దాంతో ప్రస్తుత పరిస్థితుల్లో తనను అగ్రరాజ్యం రక్షిస్తుందన్న భరోసా ఆయనకు చిక్కలేదు. తాలిబన్లకు పట్టుబడి చిత్రహింసల పాలబడేకంటే సరిహద్దులను దాటిపోవడమే ఉత్తమమనుకొన్నారు. ఘనీతో కలిసి ఆ మేరకు తన దారి తాను చూసుకొన్నారు.

వాగ్దానానికి జెల్లకొట్టి..

కొత్త సహస్రాబ్దికి ముందు అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం సాగుతున్నప్పుడు- వారికి వ్యతిరేకంగా కమాండర్‌ మసూద్‌ను సీఐఏ ఎగదోసింది. ఆ తరవాత ఎందుకనో ఈ ప్రాంతంపై అగ్రరాజ్యం ఆలోచనలు మారిపోయాయి. తాలిబన్ల పీచమణచడానికి పూర్తిస్థాయిలో మద్దతిస్తామని మసూద్‌కు చేసిన వాగ్దానానికి జెల్లకొట్టి, మిత్రులకు నమ్మకద్రోహం చేసి అమెరికా చక్కాపోయింది. ఆ క్రమంలోనే మసూద్‌ను ముష్కరులు మట్టుపెట్టారు. ఆ తరవాత ఆయన సహచరులకు సహాయం అత్యవసరమైనప్పటికీ అమెరికా ఆ మేరకు ముందుకు రాలేదు. 2000 సంవత్సరంలో అమ్రుల్లా నేతృత్వంలో తాలిబన్లపై పోరాటానికి సంసిద్ధమైన అఫ్గాన్‌ దళాలకు అండదండలు అందించలేదు. ఫలితంగా తమకు ఉన్న కొద్దిపాటి వనరులతోనే సలేహ్‌ బృందం తాలిబన్లతో తలపడాల్సి వచ్చింది. అప్పట్లో అమ్రుల్లాకు జర్మనీ ద్వారా కొద్దిమేరకు అమెరికా సాయం చేసింది కానీ, తాలిబన్లను నిలువరించడానికి అది సరిపోలేదు. సలేహ్‌ ఎలాగో తిప్పలు పడి తజకిస్థాన్‌ గుండా ఆయుధాలు, ఇతర సామగ్రిని తెచ్చుకొనేవారు. న్యూయార్క్‌పై సెప్టెంబరు 11 దాడులు జరిగాకగానీ, అమెరికాకు తత్వం బోధపడలేదు. అల్‌ఖైదా నాయకులను, వాళ్లకు తోడ్పడుతున్న తాలిబన్లను వేటాడటానికి అప్పుడు అఫ్గాన్‌లో కాలుపెట్టింది. అలా ఉగ్రవాదంపై యుద్ధం ప్రారంభించింది.

అక్కడితో ఆసక్తి సన్నగిల్లిపోయింది..

పదేళ్ల తరవాత 2011లో అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ను అమెరికా దళాలు పాకిస్థాన్‌లో హతమార్చాయి. అక్కడితో ఉగ్రవాదంపై పోరులో అగ్రరాజ్యానికి ఆసక్తి సన్నగిల్లిపోయింది. తాలిబన్లతో రోజూ తలపడాల్సి రావడంతో విసిగి వేసారిపోయింది. యుద్ధంతో చితికిపోయిన దేశంలో పరమక్రూరులైన ఆటవిక మూకలను ఎదుర్కోవడానికి భారీగా ఎందుకు వెచ్చించాలన్న ఆలోచనలో పడింది. చర్చల ద్వారా అఫ్గానిస్థాన్‌లోంచి బయటపడాలని తలపోసింది. ట్రంప్‌ హయాములో మొదలైన ఆ క్రతువుకు బైడెన్‌ యంత్రాంగం తుదిరూపమిచ్చింది. ఇక్కడే అమెరికా వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. తమ బలగాల నిష్క్రమణతో తలెత్తే భయంకర పరిస్థితులను అగ్రరాజ్యం సరిగ్గా అంచనా వేయలేకపోయింది. తానే స్వయంగా తర్ఫీదునిచ్చిన అఫ్గాన్‌ దళాలు పోరాడతాయని, కనీసం కొద్దినెలల పాటైనా తాలిబన్లను నిలువరించగలుగుతాయని భావించింది. కానీ, రోజుల వ్యవధిలోనే కాబూల్‌ కూలిపోవడంతో అంతర్జాతీయంగా అమెరికాకు తలవంపులు ఎదురయ్యాయి. గడచిన కొన్నేళ్లలో తాలిబన్లు బలం పుంజుకొన్న తీరును అగ్రరాజ్యం అసలు పసిగట్టలేకపోయింది. క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోవడంలో అమెరికన్‌ నేతలు విఫలమయ్యారు. అవకాశం దక్కిన మరుక్షణంలో దేశమంతటినీ అక్రమించుకోవడానికి తాలిబన్లు ఏనాడో సిద్ధమయ్యారన్న సంగతిని వారు తెలుసుకోలేకపోయారు.

భారత్‌కు ప్రమాదమే!

ఇరుగుపొరుగు దేశాలు సైతం తాలిబన్‌ వ్యతిరేక దళాలకు తోడ్పాటు అందించలేదు. అఫ్గాన్‌ను కైవసం చేసుకోవడానికి మునుపే తాలిబన్‌ నేతలు ఇరాన్‌, చైనా, తజికిస్థాన్‌, రష్యా, పాకిస్థాన్‌లలో పర్యటించారు. తమకు మద్దతు ఇవ్వకపోయినా తటస్థంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తాలిబన్లకు పాకిస్థాన్‌ ప్రత్యక్ష మద్దతు ఉందన్నది బహిరంగ రహస్యం. దక్షిణాసియాపై పట్టు సాధించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న చైనా- పాక్‌ ద్వారా అఫ్గాన్‌లో తిష్ఠవేయడానికి సిద్ధమవుతోంది. ఉగ్రవాదానికి తమ గడ్డను నెలవు కానివ్వబోమని తాలిబన్లు చెబుతున్న మాటలను విశ్వసించే పరిస్థితి లేదు. అల్‌ఖైదాతో పాటు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద తండాలన్నింటికీ తాలిబన్ల తోడ్పాటు అందడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అంతర్గత భద్రతను పటిష్ఠం చేసుకోవడంపై భారత్‌ తక్షణం దృష్టిసారించాలి. తాలిబన్లతో వ్యవహరించాల్సిన తీరుకు సంబంధించి సమర్థ విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవాలి. దిల్లీ వ్యూహాలకు దేశప్రయోజనాలే పరమావధి కావాలి.

తప్పంతా వాళ్లదే!

అమెరికాపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో అధ్యక్షుడు జో బైడెన్‌ తాపీగా స్పందించారు. అఫ్గాన్‌ పౌరుల ఆవేదన తనను తీవ్రంగా కలచివేస్తోందంటూనే, బలగాల ఉపసంహరణపై తమ నిర్ణయాలను సమర్థించుకొన్నారు. తాలిబన్లతో పోరాటానికి సిద్ధంగా ఉండాలని అష్రాఫ్‌ ఘనీని ముందే హెచ్చరించినా, వాళ్లు ఆ మేరకు తెగువ చూపలేకపోయారంటూ- తప్పంతా అఫ్గానీలపైకే నెట్టేశారు!

- బిలాల్‌ భట్‌ (కశ్మీరీ వ్యవహారాల నిపుణులు)

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.