ETV Bharat / international

అమెరికా కాంగ్రెస్​లో కీలక బిల్లు- 1.1కోట్ల మందికి లబ్ధి

author img

By

Published : Feb 19, 2021, 11:42 AM IST

భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త. అమెరికాలో పౌరసత్వం పొందాలనుకునే ఎంతో మంది కలలు నెరవేరనున్నాయి. 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులకు దేశ పౌరసత్వం కల్పించే బిల్లును కాంగ్రెస్​లో ప్రవేశపెట్టారు డెమొక్రాట్లు.

Citizenship
అమెరికా కాంగ్రెస్​లో కీలక బిల్లు- 1.1 కోట్ల మందికి లబ్ధి

1.1 కోట్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించే 2021 పౌరసత్వ బిల్లును అమెరికా కాంగ్రెస్​లో ప్రవేశపెట్టారు. వివిధ దేశాలకు ఇచ్చే ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోటాను తొలగించడం, హెచ్-1బీ విదేశీ కార్మికులపై ఆధారపడినవారికి పని అధికారం వంటి విషయాలను ఈ బిల్లులో పొందుపరిచారు.

ఈ బిల్లుకు ప్రతినిధుల సభ, సెనేట్​లో ఆమోదం లభిస్తే అక్రమ వలసదారులతో పాటు లక్షలాది మంది విదేశీ పౌరులకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ముఖ్యంగా వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, వారి కుటుంబాలకు ఈ బిల్లు లబ్ధి చేకూర్చనుంది.

ఈ బిల్లును సెనేటర్లు బాబ్​ మెనెండెజ్, లిండా సాంచెజ్​ కాంగ్రెస్​లో ప్రవేశపెట్టారు.

బిల్లులో ఏమున్నాయి?

  • ఉపాధి-ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు చేయడం.
  • ప్రతి దేశానికి ఇచ్చే వీసాల్లో పరిమితులను తొలగించడం.
  • తక్కువ వేతన పరిశ్రమలలోని కార్మికులకు గ్రీన్​కార్డుల లభ్యతను మెరుగుపరచడం.
  • హెచ్​-1బీ వీసాదారులకు పని అధికారం.

"నేను మెక్సికో నుంచి వలస వచ్చిన వారి కూతురిని. ప్రజలు భయం లేకుండా జీవించడానికి వీలు కల్పించే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను రూపొందిచాలని, దేశ అభివృద్ధికి నా వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లును ప్రతిపాదించాం."

- లిండా సాంచెజ్, కాంగ్రెస్ సభ్యురాలు.

అధికార డెమొక్రాట్లకు ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ మెజారిటీ ఉంది. అయినప్పటికీ ఈ బిల్లు ఆమోదం పొందాలంటే సెనేట్​లో వారికి 10మంది రిపబ్లికన్ల మద్దతు అవసరం.

దేశంలో నివసిస్తోన్న మిలియన్ల మంది వలసదారుల ప్రయోజనాల కోసం తమకు అవసరమైన మద్దతు లభిస్తుందని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.