ETV Bharat / international

ఇమ్రాన్​తో భేటీలో ట్రంప్​ నోట మళ్లీ 'కశ్మీర్'​ పాట

'కశ్మీర్'​ తమ అంతర్గత విషయమని భారత్​ ఎన్ని సార్లు స్పష్టం చేసినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తీరు మాత్రం మారడం లేదు. పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​తో తాజాగా జరిగిన భేటీలో కశ్మీర్​ అంశాన్ని ప్రస్తావించారు ట్రంప్​.

Ahead of meet with Imran Khan in Davos, Donald Trump talks Kashmir
ఇమ్రాన్​తో భేటీలో ట్రంప్​ నోట మళ్లీ 'కశ్మీర్'​ పాట
author img

By

Published : Jan 22, 2020, 5:33 AM IST

Updated : Feb 17, 2020, 10:56 PM IST

కశ్మీర్​ అంశంపై భారత్​- పాకిస్థాన్ మధ్య జరుగుతోన్న పరిణామాలను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని​ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ అన్నారు. ఈ వివాదంపై సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ట్రంప్.

దావోస్​లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​తో ట్రంప్​ భేటీ అయ్యారు. కశ్మీర్​ అంశం సహా పలు విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇమ్రాన్​తో భేటీలో ట్రంప్​ నోట మళ్లీ 'కశ్మీర్'​ పాట

"మేము వాణిజ్యం సహా పలు విషయాలపై చర్చిస్తున్నాం. అయితే వాణిజ్యం ఇందులో ప్రధానాంశం. కశ్మీర్​ అంశం, పాకిస్థాన్​- భారత్​ మధ్య పరిణామాలపైనా చర్చించాం. సాయం చేయాల్సివస్తే చేస్తాం. ఇరు దేశాల మధ్య పరిణామాలను చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాం." - డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు ​

భారత పర్యటన సందర్భంగా పాకిస్థాన్​కు వెళ్తారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్​ బదులిచ్చారు. ఇప్పుడు భేటీ అయ్యాం.. కనుక కలవకపోవచ్చు అని సమాధానమిచ్చారు ట్రంప్. అయితే ఇమ్రాన్​ తనకు మంచి స్నేహితుడని.. మళ్లీ కలవడానికి సంతోషిస్తానన్నారు అమెరికా అధ్యక్షుడు.

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/udaipur-man-names-son-congress20200121213917/

Conclusion:
Last Updated : Feb 17, 2020, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.