ETV Bharat / international

సూపర్​మార్కెట్​లో పిల్లాడ్ని 'కొనేందుకు' మహిళ యత్నం- 10ఏళ్లు జైలు!

Texas woman: సూపర్​మార్కెట్​లో ముద్దుముద్దుగా కనిపించిన ఓ పసిపిల్లాడ్ని తనకు అమ్మేయాలంటూ తల్లిపై ఒత్తిడి తెచ్చింది ఆ మహిళ. ఏకంగా 5 లక్షల డాలర్లు ఇస్తానని ఆఫర్​ ఇచ్చింది. అందుకు నిరాకరించిన తల్లిపై దాదాపు దాడి చేసినంత పని చేసింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు.

Texas woman demanded to buy a child
Texas woman demanded to buy a child
author img

By

Published : Jan 25, 2022, 2:28 PM IST

Texas woman: తల్లితో కలిసి సూపర్​ మార్కెట్​కు వచ్చిన పసిపిల్లవాడిని 'కొందాం' అనుకున్న మహిళ కటకటాలపాలైంది. దాదాపు పదేళ్లు శిక్ష పడే అవకాశమున్న కేసులో విచారణ ఎదుర్కొంటోంది. అమెరికా టెక్సాస్ రాష్ట్రం క్రొకెట్​లో జరిగిందీ ఘటన.

ముద్దుగా ఉన్నాడంటూ..

Texas Woman Arrested Walmart: ఓ మహిళ.. నెలల వయసున్న కుమారుడితో కలిసి గతవారం వాల్​మార్ట్​కు వచ్చింది. సెల్ఫ్​ చెక్​ఔట్​ లైన్​లో వేచి చూస్తుండగా.. నిందితురాలు రెబెకా లానెట్ టేలర్(49) మరో మహిళతో కలిసి వచ్చింది. ఆ పిల్లాడి జుట్టు, నీలి రంగు కళ్లు ఎంతో బాగున్నాయంటూ మాట కలిపింది. అతడ్ని ఎంతకు అమ్ముతావంటూ తల్లిని ప్రశ్నించింది. రెబెకా జోక్ చేస్తోందని అనుకుని.. ఆ మహిళ ఊరుకుంది.

కానీ రెబెకా టేలర్​ మాత్రం అక్కడితో ఆగలేదు. "నా కారులో రెండున్నర లక్షల డాలర్లు ఉన్నాయి. పిల్లాడ్ని ఇస్తే ఆ డబ్బంతా నీకు ఇచ్చేస్తా" అని ఆఫర్ ఇచ్చింది. ఇంతలోనే టేలర్​తో పాటు వచ్చిన మహిళ.. పిల్లాడి పేరు ఏంటని అడిగింది. తల్లి సమాధానం ఇవ్వలేదు. అసలు ఏం జరుగుతుందా అని ఆలోచించేలోపే.. టేలర్, ఆమెతో ఉన్న వ్యక్తి.. ఆ పిల్లాడ్ని పేరు పెట్టి పిలవడం మొదలుపెట్టారు. అతడ్ని కొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ మాటలతో ఆ తల్లి ఒక్కసారిగా భయపడిపోయింది. అక్కడి నుంచి హుటాహుటిన వెళ్లిపోయింది.

ధర పెంచి.. బెదిరించి..

తల్లి, పిల్లవాడు పార్కింగ్​ లాట్​లో ఉండగా.. రెబెకా టేలర్​ మరోమారు వారి దగ్గరకు వెళ్లింది. ఈసారి స్వరం పెంచింది. తల్లిపై అరవడం మొదలుపెట్టింది. "రెండున్నర లక్షల డాలర్లు చాలకపోతే 5లక్షల డాలర్లు(సుమారు రూ.3కోట్ల 74 లక్షలు) ఇస్తా. నాకు ఆ పిల్లవాడు కావాల్సిందే. నేను అతడ్ని తీసుకెళ్తా" అని గట్టిగా చెప్పింది.

టేలర్​ మాటలతో వణికిపోయిన తల్లి.. పిల్లవాడితో కలిసి తన కారులో లాక్​ చేసుకుని కూర్చొంది. కాసేపటికి టేలర్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలన్నీ చూసిన పోలీసులు.. టేలర్​ను అరెస్టు చేశారు. హ్యూస్టన్ కౌంటీ జైలుకు తరలించారు.

ఈ కేసులో టేలర్​ దోషిగా తేలితే.. ఆమెకు పదేళ్ల వరకు జైలు శిక్ష, 10 వేల డాలర్ల వరకు జరిమానా పడే అవకాశముంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: రూ.లక్షన్నరతో రెండేళ్ల పిల్లాడి షాపింగ్- అమ్మ ఫోన్​తో ఆడుకుంటూ...

రిపోర్టర్​పై బైడెన్ బూతు పురాణం... ఆ నేతలను మించి...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.