ETV Bharat / international

Biden Xi Meeting: బైడెన్​-జిన్​పింగ్ కీలక భేటీ.. ఎజెండా ఇదే! - international news

అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో సోమవారం ఇరు దేశాల అధినేతలు కీలక సమావేశంలో పాల్గొంటున్నారు(biden xi meeting). వర్చువల్​గా జరిగే ఈ భేటీలో తైవాన్ వివాదం సహా ముఖ్యమైన అంశాలపై జో బైడెన్, జిన్​పింగ్ మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది(biden xi jinping).

Biden Xi Meeting
బైడెన్​-జిన్​పింగ్ కీలక భేటీ.. ఎజెండా ఇదే!
author img

By

Published : Nov 15, 2021, 1:49 PM IST

అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్​, చైనా అధ్యక్షుడు జీ జిన్​పింగ్ మధ్య సోమవారం కీలక భేటీ జరగనుంది(biden xi meeting). రెండు దేశాల మధ్య సంబంధాలు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది((biden xi jinping)). భేటీ వర్చువల్​గానే జరుగుతున్నప్పటికీ బైడెన్​-జిన్​పింగ్ మధ్య చర్చలు వాడివేడిగా సాగనున్నట్లు తెలుస్తోంది. గతంలో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షునిగా ఉన్న సమయంలో చైనా ఉపాధ్యక్షునిగా ఉన్న జిన్​పింగ్​ను బీజింగ్​లో కలిశారు. ఇద్దరు కలిసి నూడిల్స్ కూడా తిన్నారు. సరదా సంభాషణ జరిపారు. కానీ దేశ అధ్యక్ష హోదాలో ఇద్దరు అగ్రనేతలు అధికారంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. అయితే ఫిబ్రవరి, సెప్టెంబర్​లో ఇరువురూ ఫోన్​లో సుదీర్ఘంగా సంభాషించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, వాణిజ్యం, కరోనా పాండెమిక్​, మానవహక్కులు వంటి విషయాలపై చర్చించారు(us china relations).

ఎజెండా ఇదే..!

సోమవారం బైడెన్​-జిన్​పింగ్​ మధ్య జరిగే వర్చువల్​ భేటీలో(biden xi jinping news) కీలక విషయాలు చర్చకు రానున్నట్లు సమాచారం. వాయవ్య చైనాలో సంప్రదాయ తెగలపై జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన, హాంకాంగ్​ విషయంలో చైనా ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రయత్నాలు, కరోనా మూలాల అన్వేషణలో సహకారం వంటి అంశాలను జిన్​పింగ్​తో బైడెన్ ప్రస్తావించనున్నట్లు శ్వేతసౌధ వర్గాలు తెలిపాయి(biden china).

స్వయం పాలిత ద్వీపం తైవాన్ సమీపంలో చైనా సైన్యం ఎక్కువ సంఖ్యలో యుద్ధ విమానాలు ఎగరవేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది(us china war over taiwan). తైవాన్ తమ భూభాగమే అని చైనా చెబుతోంది. బైడెన్​తో భేటీలో ప్రధానంగా ఇదే సమస్యను లేవనెత్తనున్నట్లు చైనా అధికారిక వర్గాలు సంకేతాలిచ్చాయి(us china news taiwan ). అయితే బైడెన్ మాత్రం గత అమెరికా ప్రభుత్వాలు అనసురించిన 'వన్​ చైనా' పాలసీకే తాను కట్టుబడి ఉండనునున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. తైవాన్​తో సంబంధాలు, రక్షణ ఒప్పందాలు కొనసాగుతాయని తేల్చిచెప్పారు. అమెరికా కాంగ్రెస్​ ప్రతినిధులు తైవాన్​ను సందర్శించినందుకు స్పందనగా గతవారం అక్కడ చైనా సైనిక బలగాలు యుద్ధ విన్యాసాలు చేపట్టాయి. దీంతో బైడెన్​-భేటీ తర్వాత ఎలాంటి ప్రకటన వస్తుందనే ఆసక్తి నెలకొంది(us china news latest).

2013లో బైడెన్ చైనాను సందర్శించినప్పుడు ఆయన తన పాత మిత్రుడని జిన్​పింగ్ అన్నారు. బైడెన్​ కూడా తమ మధ్య స్నేహం గురించి మాట్లాడారు. అయితే కరోనా మూలాలు కనుగోనే విషయంలో చైనా సహకరించాలని తన పాత మిత్రుడిని అడుగుతారా? అని బైడెన్​ను జూన్లో ఓ విలేకరి ప్రశ్న అడగ్గా.. 'మేం ఇద్దరం ఒకరికొకరం బాగా తెలుసు, పాత స్నేహితులం కాదు. అని బదులిచ్చారు.

సోమవారం బైడెన్​-జిన్​పింగ్​ మధ్య జరిగే భేటీపై శ్వేతసౌధం ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. పెద్దప్రకటనలు వచ్చే సూచనలు లేవని, సంయుక్త ప్రకటన కూడా విడుదల చేసే ఆలోచన లేదని పేర్కొన్నాయి.

గతవారం స్కాట్లాండ్​ గ్లాస్గోలో జరిగిన వాతవారణ మార్పు సదస్సులో పాల్గొన్న అమెరికా, చైనా.. కర్భన ఉద్ఘారాలను తగ్గించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశాయి.

ఇదీ చదవండి: 'భారత్​పై ఆంక్షలా.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.