ETV Bharat / international

పదేళ్ల చిన్నారి పర్వతారోహణ.. అరుదైన ఘనత

10 ఏళ్ల కొలరాడో చిన్నారి సెలా స్కెనీటర్ సరికొత్త రికార్డు సాధించింది. పర్వతారోహణకు అత్యంత సవాలుతో కూడిన 'ఈఐ క్యాపిటన్' పర్వాతాన్ని అధిరోహించిన చిన్న వయస్కురాలిగా పేరు సంపాదించింది.

పదేళ్ల చిన్నారి పర్వతారోహణ
author img

By

Published : Jun 21, 2019, 6:03 AM IST

పదేళ్ల చిన్నారి పర్వతారోహణ.. అరుదైన ఘనత

అమెరికాలోని 10 ఏళ్ల కొలరాడో చిన్నారి సెలా స్కెనీటర్ యోస్మిటీ జాతీయ పార్కులో ఉన్న 'ఈఐ క్యాపిటన్'​ పర్వతాన్ని అధిరోహించింది. పర్వతారోహణకు అత్యంత సవాళ్లతో కూడిన ఈ పర్వతాన్ని అధిరోహించిన అత్యంత చిన్న వయస్కురాలిగా పేరు సంపాదించింది ఈ చిన్నారి.

తన తండ్రి మైక్​ స్కెనీటర్​, కుటుంబ సన్నిహితుడు మార్క్ రెగియర్​ల సహాయంతో 3000 అడుగుల (910 మీటర్ల) ఎత్తు ఉన్న 'ఈఐ క్యాపిటన్​' పర్వతాన్ని అధిరోహించింది స్కెలా.

అనువుగా ఉండే దారిలో ఐదు రోజుల పాటు శ్రమించి ఈ ముగ్గురు జూన్​ 12న శిఖరానికి చేరారు. సాధారణంగా ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు పర్వతారోహకులకు 4-5 రోజుల సమయం పడుతుందని అక్కడి నిపుణులు అంటున్నారు.

"ఈ పర్వతం విజయవంతంగా అధిరోహించినందుకు సంతోషంగా ఉంది. భావోధ్వేగానికి లోనవుతున్నాను. అప్పుడే ఈ ప్రయాణం పూర్తయిందనే చిన్న బాధ కూడా ఉంది."
- సెలా స్కెనీటర్​, పర్వతాన్ని అధిరోహించిన చిన్నారి

ఇదీ చూడండి: అమెరికా నిఘా డ్రోన్​ను కూల్చేశాం: ఇరాన్​

Intro:Body:

wewe

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.