ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు.
పొగలో ప్రమాదకర వాయువులు:
అగ్ని ప్రమాదంతో ఏర్పడిన పొగలో ప్రమాదకర రసాయనిక వాయవులున్నట్లు అధికారులు గుర్తించారు.సమీప ప్రాంత ప్రజలు తమ నివాసాలను విడిచి బయటకు రావద్దని సూచించారు. పొగను పీల్చడం వల్ల హృదయ స్పందనలో మార్పులు, తలనొప్పి, మత్తు లాంటి సమస్యలు వస్తాయనిహెచ్చరించారు.