ETV Bharat / international

అమెరికాపై విశ్వరూపం.. ఒక్కరోజే 76 వేల కేసులు - world cases

ప్రపంచదేశాలపై కరోనా రక్కసి విశ్వరూపం చూపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కరోజులోనే 76 వేలకుపైగా కొత్త కేసులు రావటం వైరస్​ తీవ్రతకు అద్దంపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1.56 కోట్లు దాటింది. 6.36 లక్షలకుపైగా మరణించారు.

COVID19 cases
అమెరికాలో కరోనా రక్కసి విశ్వరూపం
author img

By

Published : Jul 24, 2020, 8:02 AM IST

కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు వైరస్​ తీవ్రత ఎక్కువవుతోంది. కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రోజుకు 2 లక్షల మందికి పైగా వైరస్​ బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య కోటీ 56 లక్షలు దాటింది. 6.36 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 15,650,441
  • మరణాలు: 636,384
  • కోలుకున్నవారు: 9,534,840
  • యాక్టివ్​ కేసులు: 5,479,217

అమెరికాలో ఒక్కరోజే 76 వేలు

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఒక్కరోజే 76,570 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,225 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 42 లక్షలకు చేరువైంది. 1.47 లక్షల మంది వైరస్​కు బలయ్యారు.

బ్రెజిల్​లో..

కేసులు, మరణాల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్​లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త కేసులు రికార్డ్​ స్థాయిలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 23 లక్షలకు చేరువైంది. 84 వేలకుపైగా ప్రాణాలు కోల్పోయారు.

రష్యాలో..

రష్యాలో వైరస్​ పంజా విసురుతోంది. అయితే.. కేసుల పరంగా నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. మరణాలు తక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 8 లక్షలకు చేరువైంది. దాదాపు 13 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

దక్షిణాఫ్రికాలో..

దక్షిణాఫ్రికాలో వైరస్​ వ్యాప్తి వేగం పుంజుకుంది. కేసుల పరంగా పెరు, మెక్సికో వంటి దేశాలను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా 4 లక్షలకుపైగా వైరస్​ బారిన పడ్డారు. 6 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసుల వివరాలు

దేశంమొత్తం కేసులుమరణాలు
అమెరికా4,169,991147,333
బ్రెజిల్2,289,95184,207
రష్యా795,03812,892
దక్షిణాఫ్రికా408,0526,093
పెరు371,09617,654
మెక్సికో370,71241,908
చిలీ338,759 8,838
స్పెయిన్ 317,24628,429
బ్రిటన్​ 297,14645,554

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.