ETV Bharat / international

విమానం కూలి ఆరుగురు మృతి - విమానం కూలి ఆరుగురు మృతి

ఉత్తర మెక్సికో ప్రాంతంలో విమానం కుప్పకూలింది. శనివారం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు.

6 dead 1 injured in small plane crash in northern Mexico
విమానం కూలి-ఆరుగురు మృతి
author img

By

Published : Mar 28, 2021, 12:02 PM IST

అమెరికాలోని అరిజోనా వైపు వెళ్తున్న విమానం కుప్పకూలిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం ఉత్తర మెక్సికో సరిహద్దు సమీపంలోని సొనోరా ప్రాంతంలో జరిగింది.

సెన్నా సంస్థకు చెందిన ఈ విమానం హర్మోసిల్లో ప్రాంతం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే కుప్పకూలిందని అధికారులు స్పష్టం చేశారు. మృతుల్లో సొనోరా రాష్ట్ర ఆర్థిక శాఖకు చెందిన అధికారి ఒకరు ఉన్నారని తెలిపారు. పైలట్​ కూడా మృతిచెందినట్లు పేర్కొన్నారు.

విమానం కుప్పకూలిపోవడానికి కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:వెలుగుల భవిష్యత్​ కోసం 'ఎర్త్ అవర్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.