కరోనా విజృంభణకు చైనాయే కారణమని విరుచుకుపడింది అమెరికా జాతీయ భద్రతా సలహా మండలి. గడిచిన రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సార్స్, స్వైన్ ఫ్లూ, ఏవియన్ ఫ్లూ వంటి భయంకరమైన 5 మహమ్మారులు చైనాలోనే పుట్టాయని మండిపడింది.
చైనా నిర్లక్ష్యం కారణంగా ప్రపంచం ఇప్పటికే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎంతో నష్టపోయిందన్న అగ్రరాజ్య భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రీన్... పరిస్థితులు ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ప్రపంచ దేశాలన్నీ చైనాకు వ్యతిరేకంగా గళమెత్తుతాయని హెచ్చరించారు. కరోనా కట్టడిలో సహకరించేందుకు నిపుణులను పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, తమను అనుమతించలేదని చైనా తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
పూహాన్‌లోనే కొవిడ్ మూలాలు ఉన్నాయనడానికి సరైన ఆధారాలున్నాయని రాబర్ట్ అభిప్రాయపడ్డారు, మరిన్ని ఆధారాల కోసం అన్వేషణ కొనసాగుతుందన్నారు. ప్రాణాంతక మహమ్మారులను ఎలా నిరోధించాలో ప్రపంచ దేశాలను చూసి చైనా నేర్చుకోవాలని అమెరికా సూచించింది.
ఇదీ చదవండి:113 ఏళ్ల వయసులో కరోనాను కసితీరా ఓడించి!