చైనాలోని వుహాన్‌లో గతేడాది డిసెంబరు నెలాఖరున బయటపడిన మహమ్మారి క్రమేపీ విస్తరించింది. 10 లక్షల కేసులకు చేరడానికి 3 నెలలు పట్టింది. అక్కడి నుంచి ప్రతి రెండు వారాల్లోపే 10 లక్షల వంతున కేసులు పెరుగుతూ పోతున్నాయి.
చైనాలో దాదాపు కేసులన్నీ ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే నమోదయ్యాయి. మార్చి నుంచి ఇక్కడ తీవ్రత తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో అమెరికాలో మరే దేశంలోనూ లేనంత తీవ్రంగా కేసులు పెరిగాయి. ఇటలీ, స్పెయిన్, జర్మనీల్లోనూ కేసులు చైనాను మించిపోయాయి.
అమెరికాలో పరిస్థితి అదుపు తప్పింది. ప్రపంచవ్యాప్తంగా కేసుల్లో దాదాపు మూడో వంతు ఇక్కడే నమోదయ్యాయి. చైనా మరింత కిందకు రాగా స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, యూకేల్లో కేసులు అమాంతం పెరిగాయి. భారత్‌లోనూ తీవ్రత పెరిగింది.
కరోనా విలయతాండవం అమెరికాలో కొనసాగింది. 2 వారాల్లోనే 5 లక్షల కేసులు పెరిగాయి. అమెరికా, స్పెయిన్, ఇటలీ.. ఈ 3 దేశాల్లోనే ఏప్రిల్‌లో దాదాపు 85 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధిక కేసుల జాబితాలో భారత్ 16వ స్థానానికి చేరింది.
అత్యధిక కేసులు నమోదైన 10 దేశాల నుంచి చైనా వెనక్కి వెళ్లింది. ఈ జాబితాలోకి బ్రెజిల్ చేరింది. అమెరికా అల్లాడుతూనే ఉంది. రష్యాలో ఒక్కసారిగా తీవ్రత పెరిగింది.
కేసుల వివరాలను పరిశీలిస్తే...
జనవరి 1 - ఏప్రిల్ 2
10 లక్షలు
93 రోజులు: కేసులు 10 లక్షలకు చేరడానికి పట్టిన సమయం
ఏప్రిల్ 15
20 లక్షలు
13 రోజులు: కేసులు 10 లక్షల నుంచి 20 లక్షలకు చేరడానికి పట్టిన కాలం
ఏప్రిల్ 27
30 లక్షలు
12 రోజులు: కేసులు 20 లక్షల నుంచి 30 లక్షలకు చేరడానికి పట్టిన సమయం
మే 9
40 లక్షలు
12 రోజులు: కేసులు 30 లక్షల నుంచి 40 లక్షలకు చేరడానికి పట్టిన సమయం