కెనడా టొరంటోలోని ఒంటారియో నగరంలో విద్వేషపూరిత ఘటన జరిగింది. నిర్దిష్ట మతానికి చెందినవారనే కారణంతో కుటుంబంపైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు ఓ యువకుడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనా స్థలికి దగ్గర్లో ఉన్న ఓ పార్కింగ్ ప్రదేశంలో నిందితుడు నాథానియెల్ వెల్ట్మన్(20)ను అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ అఫ్జల్(46), మదీహా(44), యుమ్నా(15), మరో 74 ఏళ్ల మహిళ ఈ ఘటనలో మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు.

ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఇస్లామోఫోబియాను ఎదుర్కొనేందుకు ప్రతి మార్గాన్ని ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు.


స్థానిక మేయర్ ఎడ్ హోల్డర్ సైతం ఈ ఘటనను తప్పుబట్టారు. "ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన సామూహిక హత్యాయత్నమిది. అత్యంత విద్వేషపూరితంగా జరిగిన ఘటన" అంటూ మండిపడ్డారు.
ఇదీ చదవండి: గాంధీ మునిమనవరాలికి ఏడేళ్ల జైలుశిక్ష