US Shooting: అమెరికాలో జార్జియా రాష్ట్రంలో కాల్పులు కలకలం సృష్టించాయి. అట్లాంటా పట్టణంలో మంగళవారం (స్థానిక కాలమానం ప్రకారం) ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు కూడా మృతిచెందాడు. మృతుల్లో ఓ పోలీస్ ఆఫీసర్ ఉండటం గమనార్హం. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
క్లేటాన్ కౌంటీలోని రెక్స్ అనే ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే నిందితుడు అక్కడున్న ఓ పోలీసు ఆఫీసర్ సహా మరో ఇద్దరు మహిళలను కాల్చి చంపాడు. ఓ 12 ఏళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు.
మృతిచెందిన అధికారి హెన్రీ లాక్సన్గా గుర్తించారు పోలీసులు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ మరో పోలీస్, బాలుడికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
జార్జియాలోని హెన్రీ కౌంటీలో గతనెల జరిగిన కాల్పుల్లో కూడా ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి : Bus for sleeping: హాయిగా నిద్ర పోవాలా? ఈ బస్సు ఎక్కండి!