ETV Bharat / international

36శాతం చిన్నారుల్లో కొవిడ్​-19 లక్షణాలు లేవు

కరోనా సోకిన చిన్నారుల్లో 36 శాతం మందికి ఎలాంటి లక్షణాలూ ఉండటం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. లక్షణాలున్న చిన్నారుల్లో దగ్గు, ముక్కు కారడం, గొంతు బొంగురు పోవడం- ఈ మూడు ఎక్కువగా కనిపిస్తున్నాయని, అయితే.. నెగెటివ్​ వచ్చిన వారిలోనూ చాలా మందికి ఈ లక్షణాలు సహజంగానే ఉంటున్నాయని పరిశోధకులు తెలిపారు.

Covid symptoms in Children's
చిన్నారుల్లో కొవిడ్​-19 లక్షణాలు
author img

By

Published : Dec 2, 2020, 7:03 AM IST

కరోనా వైరస్​ సోకిన చిన్నారుల్లో మూడింట ఒక వంతుకు పైగా మందికి అసలు ఎలాంటి లక్షణాలూ ఉండటం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కెనడా, అల్బెర్టాల్లో మార్చి-సెప్టెంబరు మధ్య 2,463 మంది చిన్నారులకు కొవిడ్​-19 పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,987 మందికి పాజిటివ్​, 476 మందికి నెగెటివ్​ ఫలితం వచ్చింది. అయితే వైరస్​ సోకిన వారిలో 714 (36%) మందికి ఎలాంటి లక్షణాలూ లేకపోవడం విశేషం.

" చిన్నారుల నుంచి ఇతరులకు కరోనా సోకడం తక్కువ. కానీ, వారి నుంచి మిగతా వారికి ముప్పు లేకపోలేదు. లక్షణాలు లేకపోవడం వల్ల పిల్లలను బడులకు పంపాలా? లేదా? అన్న విషయమై ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. లక్షణాలున్న చిన్నారుల్లో దగ్గు, ముక్కు కారడం, గొంతు బొంగురు పోవడం- ఈ మూడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెగెటివ్​ వచ్చిన వారిలోనూ చాలా మందికి ఈ లక్షణాలు సహజంగానే ఉంటున్నాయి. దీంతో లక్షణాలను బట్టి చిన్నారులు కొవిడ్​-19కు గురయ్యారా, లేదా అన్నది అంచనా వేయడం కష్టం" అని అధ్యయనకర్త ఫిన్లే మెక్​అలిస్టర్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కొవిడ్ టీకాల​తో కొత్త కుంభకోణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.