పబ్జీ...! ఆన్లైన్ గేమింగ్‌లో సరికొత్త సంచలనం. తుపాకులు, బాంబులతో బుల్లితెర యుద్ధభూమిని అదరగొడుతూ గంటలుగంటలు గడిపేస్తోంది యువత. కొందరైతే "విన్నర్ విన్నర్... చికెన్ డిన్నర్" అని అనిపించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. చీట్ కోడ్స్ వాడుతున్నారు.
-
🔨🔨FAIR PLAY & BAN NOTICE🔨🔨
— PUBG MOBILE (@PUBGMOBILE) October 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
We've been stepping up our efforts to combat hackers and cheaters every day. 🎯 Check out our latest ban notice and stay tuned as we'll be releasing even more info in the coming weeks.
⬇️⬇️https://t.co/vhRQM2qSQR pic.twitter.com/aAMhap2zRX
">🔨🔨FAIR PLAY & BAN NOTICE🔨🔨
— PUBG MOBILE (@PUBGMOBILE) October 6, 2019
We've been stepping up our efforts to combat hackers and cheaters every day. 🎯 Check out our latest ban notice and stay tuned as we'll be releasing even more info in the coming weeks.
⬇️⬇️https://t.co/vhRQM2qSQR pic.twitter.com/aAMhap2zRX🔨🔨FAIR PLAY & BAN NOTICE🔨🔨
— PUBG MOBILE (@PUBGMOBILE) October 6, 2019
We've been stepping up our efforts to combat hackers and cheaters every day. 🎯 Check out our latest ban notice and stay tuned as we'll be releasing even more info in the coming weeks.
⬇️⬇️https://t.co/vhRQM2qSQR pic.twitter.com/aAMhap2zRX
ఆటో ఎయిమింగ్, చీటింగ్ టూల్స్, వర్చువల్ టూల్స్, మోడిఫైడ్ ఇన్-గేమ్ డేటాతో దొంగ ఆట ఆడుతున్నవారిపై గురిపెట్టారు పబ్జీ నిర్వాహకులు. 'క్రీడా స్ఫూర్తి'ని దెబ్బతీసే అలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించరాదని నిర్ణయించారు. అందుకే సరికొత్త నిబంధనలు తీసుకొచ్చారు.
గీత దాటినవారిపై వేటు...
పబ్జీలో చీట్ చేసేవారిని ఇకపై నిర్వాహకులు బ్యాన్ చేయనున్నారు. అది కూడా... ఒకట్రెండు రోజులు కాదు. ఏకంగా పదేళ్లు.
ఇలా గేమ్‌లో చీట్ చేసిన 30 వేల మందిపై ఒకేసారి నిషేధం విధించారు పబ్జీ నిర్వాహకులు. ఆ ఖాతాల జాబితాను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఇదీ చూడండి : పండుగ వేళ ట్విస్ట్... తగ్గిన బంగారం ధర