ETV Bharat / international

బ్లూ మూన్​: చంద్రయాన్​ రేస్​లో అమెజాన్

చంద్రునిపై మానవుడు అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయింది. ఇప్పుడు నాసా, ఇస్రో లాంటి సంస్థలు మరోమారు చంద్రయాన్​కు సిద్ధమయ్యాయి. అందుకోసం విస్తృత కసరత్తు చేస్తున్నాయి. చంద్రుడిపైకి వెళ్లే రేసులో నేనూ ఉన్నానంటూ ముందుకొచ్చింది వ్యాపార దిగ్గజం అమెజాన్​. భారీ అంతరిక్ష నౌకను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది.

చంద్రునిపైకి అమెజాన్ బ్లూ మూన్ నౌక
author img

By

Published : May 10, 2019, 1:27 PM IST

Updated : May 10, 2019, 4:49 PM IST

చంద్రయాన్​ రేసులో అమెజాన్​

చంద్రునిపై మనిషి నివాసం ఏర్పరుచుకునే దిశలో మరో ప్రయత్నం. వ్యాపార దిగ్గజం అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ చంద్రునిపైకి ఓ అంతరిక్ష నౌకను పంపనున్నట్లు ప్రకటించారు. అమెజాన్​ అనుబంధ సంస్థ బ్లూ ఆరిజిన్​ నిర్వహించే ఈ ప్రయోగం తేదీ ఎప్పుడన్నది జెఫ్​ ప్రకటించలేదు. అయితే... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ నిర్దేశించిన 2024 లక్ష్యం అందుకోగలమని ఆశాభావం వ్యక్తంచేశారు.

"ఇది బ్లూ మూన్. ఈ అంతరిక్ష వాహనంపై గత మూడేళ్లుగా పనిచేస్తున్నాం. ఇది చాలా పెద్దది. 3.6 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ నౌక చంద్రునిపై కచ్చితమైన చోట సున్నితంగా ల్యాండ్ అవుతుంది. ఈ తరహాలోనే ఇంకాస్త పెద్దదైన నౌక 6.5 మెట్రిక్ టన్నుల బరువుతో ఉపరితలంపై సున్నితంగా దిగగలదు."
-జెఫ్ బెజోస్, అమెజాన్ అధినేత

బ్లూ మూన్​ వాహక నౌక.. ఓ చిన్న ఇల్లు పరిణామంలో ఉంటుంది. సాంకేతిక పరికరాలు, నాలుగు రోవర్లు, మనుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాన్ని మోసుకెళ్లగలదు.

"బ్లూ మూన్​ పై భాగం చాలా సామాన్యంగా రూపొందించాం. పై అర​లో రకరకాల పేలోడ్స్ అమర్చుకోవచ్చు. డావిట్ వ్యవస్థను నౌకల నుంచి ప్రేరణ పొంది రూపొందించాం. చంద్రుని ఉపరితలంపై వస్తువులు దించేందుకు దీన్ని వినియోగిస్తాం. పేలోడ్స్​ను బట్టి డావిట్​ వ్యవస్థలోని పాదాలను సర్దుబాటు చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నది ఓ పెద్ద రోవర్. ఇది అంతపెద్ద రోవర్ అయినా... ఇలాంటివి నాలుగింటిని ఒకేసారి చంద్రునిపైకి తీసుకెళ్లగలదు ఈ నౌక."
-జెఫ్ బెజోస్, అమెజాన్ అధినేత

చంద్రుడి దక్షిణ ధ్రువంపై బ్లూ మూన్​ను ల్యాండ్​ చేయాలన్నది లక్ష్యం. అక్కడ మంచు నిక్షేపాలు ఉన్నట్లు 2018లోనే ధ్రువీకరించారు. ఆ నీటి నుంచి హైడ్రోజన్​ ఉత్పత్తి చేసే అవకాశముంది. అలా సౌర వ్యవస్థపై పరిశోధనలు మరింత విస్తృతం చేయాలన్నది జెఫ్​ బెజోస్​ ఆలోచన. ఈసారి చంద్రుడిపై మనిషి నివాసం ఉండేందుకు సమయం ఆసన్నమైందంటూ బ్లూ మూన్​ ప్రాజెక్టుపై అంచనాలు పెంచేశారు అమెజాన్ అధిపతి.

నాసా 2024లో చంద్రునిపైకి మానవులను తీసుకెళ్లే లక్ష్యంగా తలపెట్టిన ప్రాజెక్టుకు సహకరించే దిశగా... ఈ ప్రయోగం నిర్వహించనున్నారని తెలుస్తోంది.

Intro:Body:Conclusion:
Last Updated : May 10, 2019, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.