ETV Bharat / international

రివ్యూ 2020: ఉత్తమ స్మార్ట్​ఫోన్ బ్రాండ్లు ఇవే - భారత స్మార్ట్​ఫోన్ మార్కెట్​ లీడర్

2020 అన్ని రంగాలను కుదిపేసింది. ఇందుకు స్మార్ట్​ఫోన్ల మార్కెట్ మినహాయింపేమీ కాదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ స్మార్ట్​ఫోన్ల కంపెనీలు తమ విక్రయాలను పెంచుకునేందుకు అనేక వ్యూహాలను అమలు చేశాయి. ఈ వ్యూహాలు ఎంత వరకు పని చేశాయి? ఈ ఏడాది మొత్తం మీద ఏ కంపెనీలు ఉత్తమ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్లుగా నిలిచాయి? అనే వివరాలు మీ కోసం.

best smartphone brand of the year
2020లో ఉత్తమ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్లు ఇవే
author img

By

Published : Dec 23, 2020, 7:00 AM IST

Updated : Dec 23, 2020, 7:33 AM IST

ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​ 5.3 కోట్ల యూనిట్ల మార్క్​ ​దాటింది. కౌంటర్​ పాయింట్ సర్వేలో ఈ విషయం తేలింది. జూలై-సెప్టెంబర్ మధ్య స్మార్ట్​ఫోన్​ల షిప్మెంట్​లు గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. 9 శాతం పెరిగాయని సర్వే వివరించింది.

అగ్రస్థానంలో శాంసంగ్..

ఆన్​లైన్​ మార్కెట్లో.. 2020 మూడో త్రైమాసికంలో శాసంగ్ 24 శాతం వాటాతో భారత స్మార్ట్​ఫోన్​ మార్కెట్​ లీడర్​గా నిలిచింది. 23 శాతం వాటాతో చైనాకు చెందిన షియోమీ రెండో స్థానంలో ఉంది. మార్కెట్ సగటు విక్రయ ధర మిడ్ రేంజ్ సెగ్మెంట్​లో (రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య) షిప్మెంట్​లు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి.

కౌంటర్ పాయింట్ సర్వే ప్రకారం..

దాదాపు రెండేళ్ల తర్వాత భారత స్మార్ట్​ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది శాంసంగ్. గత ఏడాదితో పోలిస్తే 32 శాతం వృద్ధి సాధించడం ఇందుకు దోహదం చేసింది. కొవిడ్ పరిస్థితుల్లోనూ శాంసంగ్ ఈ స్థాయిలో వృద్ధి నమోదు చేసేందుకు.. శాంసగ్ అమలు చేసిన వివిధ రకాల వ్యూహాలే కారణం. సప్లయి పెంచుకోవడం, వేర్వేరు ధరల్లో ఎక్కువ సంఖ్యల్లో ఫోన్లను విడుదల చేయడం, ఆన్​లైన్​లో భారీగా ప్రమోషన్లు చేయడం వంటివి ఇందులో ప్రధానమైనవి.

షియోమీ రెండో స్థానానికి పరిమితం ఎందుకు?

2018 క్యూ3 నుంచి భారత స్మార్ట్​ఫోన్ మార్కెట్​ రారాజుగా వెలుగొందుతూ వచ్చిన షియోమీ.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రెండో స్థానానికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే.. 4 శాతం క్షీణతను నమోదు చేసింది. సప్లయి, డిమాండ్ అంతరాలు ఇందుకు కారణం కావచ్చని కౌంటర్​ పాయింట్​ పేర్కొంది.

ప్రీమియం సెగ్మెంట్లోకి వివో..

గత ఏడాదితో పోలిస్తే చైనాకు చెందిన మరో కంపెనీ వివో 4 శాతం వృద్ధితో మూడో స్థానంలో నిలిచింది. వివో వై-సిరీస్ మొబైళ్లకు ఆఫ్​లైన్ ఛానెళ్ల నుంచి వచ్చిన డిమాండ్ ఇందుకు ప్రధాన కారణం. దీనికి తోడు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఎక్స్​50 మోడల్​తో ప్రీమియం మార్కెట్​లోకీ ప్రవేశించి వినియోగాదారుల నుంచి సానుకూల స్పందనను దక్కించుకుంది.

ఫ్లిప్​కార్ట్​లో రియల్​మీదే అగ్రస్థానం..

రియల్​మీ కూడా గత ఏడాదితో పోలిస్తే.. 2020 క్యూ3లో 4 శాతం వృద్ధి సాధించింది. సప్లయి సమస్యలను అధిగమించడం, ఉత్పత్తిని పెంచడం వంటివి ఇందుకు దోహదం చేశాయి. సీ సిరీస్​, నార్జో వంటి ఫోన్లు రియల్​మీ వృద్ధికి ఉపయోగపడ్డాయి. రియల్​మీ 6,7 సిరీస్​లకు వచ్చిన డిమాండ్.. మిడ్​ రేంజ్​ సెగ్మెంట్​లో ఈ కంపెనీ 52 శాతం వృద్ధి నమోదు చేసేందుకు తోడ్పడ్డాయి. దీనితో ఫ్లిప్​కార్ట్​లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్​ఫోన్​ బ్రాండ్ స్థానాన్ని రియల్​మీ నిలబెట్టుకోగలిగింది.

ఒప్పో ఆఫ్​లైన్ హవా..

ఈ ఏడాది క్యూ3లో ఒప్పో షిప్మెంట్​లు 30 శాతం పెరిగాయి. బడ్జెట్​ ఫోన్లయిన ఏ12, ఏ11కే వంటి మోడళ్లు.. ఇటీవల విడుదల చేసిన ఏ52, ఏ53, ఎఫ్​15 వంటి మోడళ్లకు వచ్చిన ఆఫ్​లైన్ డిమాండ్ ఇందుకు కారణం.

పోకో 10 లక్షల మార్క్​

షియోమీ అనుబంధ కంపెనీ పోకో కూడా క్యూ3లో 10 లక్షల ఫోన్లను విక్రయించగలిగింది. బడ్జెట్ సెగ్మెంట్​లో విడుదల చేసిన ఎం2, ఎం2 ప్రో, ఎక్స్​ 3 వంటి మోడళ్లకు లభించిన డిమాండ్ ఇందుకు దన్నుగా నిలిచింది.

ఫీచర్​ ఫోన్లలో ఐటెల్​దే అగ్రస్థానం..

ట్రాన్షన్​ గ్రూప్ బ్రాండ్లు (ఐటెల్, ఇన్​ఫీనిక్స్, టెక్​నో) క్యూ3లో తమ మార్కెట్​ స్థానాలను తిరిగి పొందాయి. గత ఏడాదితో పోలిస్తే 73 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దేశీయంగా టైర్​ 3, టైర్ 4 పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈ బ్రాండ్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా మొత్తం హ్యాండ్​ సెట్ మార్కెట్లో 4వ స్థానాన్ని, రూ.6 వేల నుంచి రూ.10 వేల లోపు ధర ఉన్న స్మార్ట్​ఫోన్ల మార్కెట్లో 5వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి ఈ బ్రాండ్లు.

రూ.4 వేల లోపు స్మార్ట్​ఫోన్ల సెగ్మెంట్​లో ఐటెల్ అగ్రస్థానంలో నిలిచింది. ఫీచర్​ ఫోన్ల మార్కెట్లోనూ ఈ కంపెనీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

ప్రీమియం సెగ్మెంట్​లో యాపిల్ జోరు..

ప్రీమియం సెగ్మెంట్​లో (రూ.30 వేలు అంతకన్నా ఎక్కువ ధర ఉన్న స్మార్ట్​ఫోన్లు) వన్​ప్లస్​ను దాటి యాపిల్ అగ్రస్థానంలో నిలిచింది. ఎస్​ఈ 2020, ఐఫోన్​11 వంటి మోడళ్లు ఇందుకు దోహదం చేశాయి. ఐఫోన్​ 12 రాకతో వచ్చే త్రైమాసికంలోనూ ఈ స్థానం కొనసాగే అవకాశాలున్నాయి.

తక్కువ ధరలో (రూ.30 వేల నుంచి రూ.40 వేల మధ్య) ప్రీమియం స్మార్ట్​ఫోన్లను అందించే కంపెనీగా వన్​ప్లస్ నిలిచింది.

ఇదీ చూడండి:ఎంఐ నుంచి 108 మెగా పిక్సెళ్ల బడ్జెట్ స్మార్ట్​ఫోన్

Last Updated : Dec 23, 2020, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.