ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు బాలికలు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటన అమెరికా అర్కన్సాస్ రాష్ట్రంలోని అట్కిన్స్ పట్టణంలో జరిగింది.
మృతదేహాలను పరిశీలించిన అధికారులు... బాధితులు హత్యకు గురయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. మృతులు 8 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారని తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తమకు సమాచారం తెలిసిందన్నారు.
అర్కన్సాస్ రాష్ట్ర పోలీసులు సాయంతో దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అనుమానాస్పద హత్య వల్ల స్థానికులు భయాందోళనకు గురికావొద్దని తెలిపారు. కుటుంబ కలహాల వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని అన్నారు.
ఇదీ చదవండి:ఆటస్థలంలో కాల్పుల కలకలం- ముగ్గురు మృతి