అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కాల్పులు స్థానికంగా కలకలం రేపాయి. శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఓక్లాండ్ తిరిగి వస్తున్న ఓ పార్టీ బస్సుపై దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకల నుంచి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
మృతులు ఓక్లాండ్కు చెందిన అలాసియా థర్స్టన్ (19), మోడెస్టోకు చెందిన జోయ్ హ్యూస్ (16)గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో మరో ఐదుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
ఓక్లాండ్ చేరుకుంటున్న బస్సుపై ఇద్దరు సాయుధులు అకస్మాత్తుగా దాడులు జరిపారని.. బస్సుపై దాదాపు 70 రౌండ్లు కాల్పులు జరిపారని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత అక్కడున్న వీధుల్లో కూడా కాల్పులు జరిపారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : నానో ఫైబర్ ఫిల్టర్లతో కరోనాకు 100% అడ్డుకట్ట!