ETV Bharat / international

ట్రంప్​ 18 ర్యాలీలు.. 30వేల కరోనా కేసులు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ నిర్వహించిన ర్యాలీల్లో 30 వేల మందికి కరోనా సోకినట్లు స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు అంచనా వేశారు. కనీసం 700మంది మరణించి ఉంటారని పేర్కొన్నారు.

author img

By

Published : Nov 1, 2020, 11:44 AM IST

18 Trump rallies estimated to have led to over 30,000 COVID-19 cases, 700 deaths: Stanford study
18 ర్యాలీలు.. 30వేల కరోనా కేసులు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎన్నికల ప్రచారం కారణంగా 30వేల మంది కొవిడ్‌ బారినపడ్డారని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు అంచనావేశారు. వీరిలో కనీసం 700 మంది వరకు మరణించి ఉంటారని పేర్కొన్నారు. ప్రధానంగా ట్రంప్‌ ర్యాలీలు నిర్వహించిన కమ్యూనిటీలు కొవిడ్‌ వ్యాప్తిపరంగా భారీ మూల్యం చెల్లించుకొన్నాయని తెలిపారు. 'ది ఎఫెక్ట్‌ ఆఫ్‌ లార్జ్‌ గ్రూప్‌ మీటింగ్స్‌ ఆన్‌ ది స్ప్రెడ్‌ ఆఫ్‌ కొవిడ్‌-19: ది కేస్‌ ఆఫ్‌ ట్రంప్‌ ర్యాలీస్‌' అనే అంశంపై వారు పరిశోధనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జూన్‌ 20 నుంచి సెప్టెంబర్‌ 22 మధ్య ట్రంప్‌ నిర్వహించిన 18 ర్యాలీల ప్రభావాన్ని పరిశీలించారు. చివరికి ఈ ప్రదేశాల్లో 30,000 కేసులు ఎక్కువ వచ్చినట్లు గుర్తించారు. వీరిలో దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనావేశారు. వీరిలో నేరుగా ట్రంప్‌ ర్యాలీలకు హాజరుకాని వారు కూడా ఉన్నారన్నారు. భారీగా జనం గుంపులుగా చేరడం కొవిడ్‌ వ్యాప్తికి కారణం అవుతుందన్న ప్రజారోగ్య విభాగం సూచనలను సమర్థిస్తామని పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా మాస్కులు వాడకుండా భౌతిక దూరం పాటించకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

ఈ పరిశోధనపై డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జోబైడెన్‌ ట్విటర్‌లో స్పందించారు. 'ట్రంప్‌ మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోరు. ఆయన సొంత మద్దతుదారుల సురక్షితాన్ని కూడా గాలికొదిలేస్తారు' అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 2016తో పోలిస్తే భారీ విజయం ఖాయం: ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.