అమెరికా పెన్సిల్వేనియాలోని ప్రోట్స్గ్రోవ్కు చెందిన 16ఏళ్ల కైల్ జీర్స్డార్ఫ్కు వీడియో గేమ్‌లు ఆడటమంటే మహా ఇష్టం. ఈ అభిరుచే అతడికి 3 మిలియన్ డాలర్లు బహుమతిగా తెచ్చిపెట్టింది.
అమెరికాలో 'ఫోర్ట్‌నైట్ ప్రపంచకప్ సోలో ఛాంపియన్షిప్' పేరిట వీడియే గేమ్ పోటీలు నిర్వహించారు. న్యూయార్క్‌లోని అర్తర్ అషే స్టేడియంలో ఆదివారం ఫైనల్స్ జరిగాయి. కైల్ జీర్స్డార్ఫ్ విజేతగా నిలిచి 3 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు.
ఫైనల్స్‌లో అవకాశం కోసం దాదాపు 4 కోట్ల మంది వీడియోగేమ్ ఔత్సాహికులు పోటీ పడ్డారు. ఇంతమందిలో తాను గెలుపొందినందుకు పట్టలేని ఆనందంతో మురిసిపోయాడు జీర్స్డార్ఫ్. సంతోషాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పాడు.
జీర్స్డార్ఫ్ గెలిచిన ప్రైజ్‌మనీ... అమెరికా ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్‌వుడ్స్ 2019లో గెలిచిన టోర్నమెంట్ మొత్తానికంటే ఎక్కువ.
పోటీలో అమెరికాకు చెందిన 24 ఏళ్ల హారిసన్ చాంగ్ రెండో స్థానంలో నిలిచి 1.8 డాలర్లను సొంతం చేసుకున్నాడు.
ఈ వీడియో గేమ్ పోటీలో డబుల్స్‌లో ఆస్ట్రియాకు చెందిన డేవిడ్ వాంగ్(17), నార్వేకు చెందిన ఎమిల్ పిడెర్సన్(16) విజేతలుగా నిలిచారు. ఒక్కొక్కరికి 1.5 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ దక్కింది.
ఇదీ చూడండి:చందమామ వయసు గుట్టు విప్పిన కొత్త పరిశోధన!