మెక్సికోలో(Mexico Accident) ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై టోల్బూత్(Toll Booth Accident) వద్ద ఆగి ఉన్న 9 కార్లపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.
గ్లూను తరలిస్తున్న ఓ ట్రక్కు.. టోల్బూత్(Toll Booth Accident) వద్ద బ్రేకులు ఫెయిల్ అవ్వగా ఈ ప్రమాదం జరిగిందని మెక్సికో అగ్నిమాపక శాఖ అధికారి ఆర్డియన్ డియాజ్ చావెజ్ తెలిపారు. మెక్సికోలోని చాల్కో ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు.
మరోవైపు.. ఈ ప్రమాదానికి(Mexico Accident) సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో వాహనాలకు పెద్దఎత్తున మంటలు వ్యాపించినట్లుగా కనిపించాయి.
ఇదీ చూడండి: హైస్పీడ్ రైలులో కత్తితో దాడి